అనంతపురం

బీజేపీ నాలుగేండ్ల పాలన అవినీతిమయం రాఫెల్‌పై జేపీని నియమించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురంటౌన్, సెప్టెంబర్ 21: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగేండ్ల పాలనలో ఆర్థిక దోపిడీని సాగించటం, నోట్ల రద్దుతో బీజేపీ నేతల నల్లధనాన్ని మార్పిడి చేయటం, లక్షన్నర కోట్ల కాంట్రాక్ట్‌ను రిలయన్స్ అంబానీకి ఇప్పించటం, నాలుగేండ్లు అవినీతి పాలన సాగించటం తప్పా సాధించిందేమి లేదని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజమెత్తారు. శుక్రవారం స్థానిక పద్మశ్రీ కల్లూరు సుబ్బారావుకాంగ్రెస్ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవినీతి, ఆశ్రీతపక్షపాతంతో దేశ సంపదను దోచుకోవటమే పనిగా బీజేపీ పాలన సాగుతోందన్నారు. అరుణ్ జైట్లీ తాటాకు చప్పుళ్లతో ప్రజలను మభ్యపెట్టలేరన్నారు. వెంటనే రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో చోటు చేసుకున్న అవినీతిపై విచారణ జరపటానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీకి అంబానీ ఎన్నికల నిధులు ఇచ్చారేమో తెలియదుకాని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మిత్రునికి లక్షన్నర కోట్ల రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కాంట్రాక్ట్ ఇప్పించారన్నారు. రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అలాంటిదేమి జరగలేదని ప్రకటించి చట్టసభలను తప్పుదోవ పట్టించారన్నారు. నరేంద్రమోదీ ఫ్రాన్స్‌కు అంబానీని తీసుకెళ్లి దగ్గరుండి కాంట్రాక్ట్ ఇప్పించారన్నారు. బీజేపీ పాలనలో అవినీతి, అక్రమాలు పరాకాష్టకు చేరుకున్నాయని ప్రజలు గుర్తించారన్నారు. అమిత్‌షా రబీ, ఖరీఫ్ అంటే తెలుసాయని కాంగ్రెస్‌ను ప్రశ్నించటం హాస్యాస్పదంగా ఉందన్నారు. హరిత విప్లవం ద్వారా మిగులు ధాన్యాన్ని సృష్టించటం కాంగ్రెస్ చలువేనన్నారు. రైతుల రుణాలు 81 వేల కోట్లు రద్దు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. అమిత్‌షాకు చక్రవడ్డీ, బారు వడ్డీలు మాత్రమే తెలుసునన్నారు. రైతుల గురించి మాట్లాడటం అంతా ఫ్యాషనైపోయిందన్న వెంకయ్యనాయుడిలాంటి నేతలను మోస్తున్న బీజేపీకి వ్యవసాయం అన్నా, రైతుల గురించి మాట్లాడాలన్నా ఇష్టపడరని అన్నారు. మోదీ ప్రభుత్వం 15 కార్పొరేట్ కుటుంబాలకు రెండు లక్షల కోట్ల లబ్ధి చేకూర్చారని అన్నారు. ఆర్భాటపుప్రకటనలు, ప్రగల్భాలు పక్కన పెట్టాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆర్థిక దోపిడీ జరిగిందన్నారు. ఆస్ట్రేలియా బొగ్గు గనులు మొదలుకుని నోట్ల రద్దు, ఆఖరుకు రక్షణ ఉత్పత్తుల కొనుగోలు వరకు బీజేపీ అవినీతి విస్తరించిందన్నారు. బూటకపు దేశభక్తి ముసుగును తొలగించి మాట్లాడాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరింది కాంగ్రెసేనన్నారు. బీజేపీతో జగన్ కుమ్మక్కై అడ్డుగోలుగా మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదాకు చట్టం అవసరం లేదని రెండు నెలల క్రితం పేర్కొన్నారు. తిరిగి హోదాకు చట్టం కల్పించాలంటున్నారు. అపవిత్రమైన పొత్తులను కాంగ్రెస్ ఏర్పరచుకుంటోందని ఒక నేత వ్యాఖ్యానించారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ప్రకటిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. బీజేపీ నోట వచ్చే మాటను జగన్ తు.చ తప్పకుండా ఆచరిస్తున్నారని అన్నారు. అందరూ కలిసి గౌరవంగా బతికే అవకాశం కల్పించేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. దళితులు, బడుగు వర్గాలకు న్యాయం చేయటం లేదని బీజేపీని జగన్ ఏనాడూ ప్రశ్నించలేదని ఎద్దేవా చేశారు. జగన్ ఎటువైపో తేల్చుకోవాలని అన్నారు. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ఆయన మాట పెగలటం లేదన్నారు. లక్ష కోట్లకుపైగా కాంట్రాక్ట్‌ను కార్పొరేట్ కంపెనీకి కేంద్రం కట్టబెడుతుండటం జగన్‌కు కనిపించటం లేదాయని ప్రశ్నించారు. జగన్ ఏ పార్టీవైపో స్పష్టం చేయాలన్నారు. సెక్యులర్ శక్తులు, పేదలు, మైనారిటీల సంక్షేమం వైపా, రైతు రుణమాఫీని తేలికగా మాట్లాడే బీజేపీ వైపా. అధికార దాహంతో ఇష్టానుసారం మాట్లాడవద్దని సూచించారు. చట్టసభలను బహిష్కరించటం, పదవులకు రాజీనామా చేయటం ఎవరికి లాభం కలిగించటమో చెప్పాలన్నారు.