అనంతపురం

త్వరలో కాలువలకు నీటి విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, సెప్టెంబర్ 24 : మిడ్ పెన్నార్ రిజర్వాయర్ (ఎంపీఆర్) దక్షిణ కాలువకు త్వరలో జల వనరుల శాఖ అధికారులు నీటిని విడుదల చేస్తారని జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ఎస్ కే హబీబ్ బాషా తెలిపారు. నార్పల, బుక్కరాయసముద్రం, గార్లదినె్న, శింగనమల మండలాల్లో కాలువలకు నీటి అవసరాల తీర్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కాలువల కింద 33 వేల ఎకరాల్లో సాధారణంగా వరి పంట సాగవుతుందని, ఇప్పటికే రైతులు 6 వేల ఎకరాలకు సరిపడా నారుమళ్లు వేశారని తెలిపారు. కాగా నీటి అవసరం ఎక్కువగా ఉండి, అధిక పెట్టుబడి అవసరమైన వరి పంటను రైతులు వేసుకోకుండా, ఆరుతడి పంటలైన వేరుశెనగ, మొక్కజొన్న, స్వల్పకాలిక ప్రత్యామ్నాయ పంటలైన పెసలు, ఉలవలు, అలసందలు వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ పంటల సాగు వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా అధిక దిగుబడులు, లాభాలు వస్తాయని జేడీఏ సూచించారు.

నిధులు రావు.. పనులు కావు
* స్కూళ్ల మరమ్మతులు, భవన నిర్మాణాలకు గ్రహణం
* రెండేళ్లుగా అందని ద్రాక్షలా రూ.16 కోట్లు
* అరకొర నిధులతో ముందుకు సాగని పనులు
అనంతపురం, సెప్టెంబర్ 24 : విద్యాభివృద్ధిలో భాగంగా పాఠశాలల అభివృద్ధి, వౌలిక సౌకర్యాల కల్పనకు పెద్ద పీట వేస్తున్నట్లు ఓవైపు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు గుప్పిస్తున్నా, మరోవైపు నిధులు కొరతతో పురోగతి అడుగు ముందుకు, నాలుగడుగులు వెనక్కు అన్న రీతిలో తయారైంది. జిల్లాలో పాఠశాలలకు పక్కా భవనాలు, మరుగుదొడ్ల నిర్మాణం, కాంపౌండ్ గోడల ఏర్పాటు, పాత భవనాలకు అత్యవసరమైన, ముఖ్యమైన మరమ్మతులు, మండల రిసోర్స్ కమిటీ భవనాల నిమిత్తం కేటాయించిన నిధులు సకాలంలో అందడం లేదు. దీంతో పనులు ముందుకు సాగక, చేసిన కొన్ని పనులకు నిధులు అందక అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. సర్వశిక్ష అభియాన్ కింద గత రెండేళ్లుగా నిధులు విడుదలలో జాప్యం కొనసాగుతుండటమే ఇందుకు కారణం. జిల్లాకు సుమారు రూ.16 కోట్ల నిధులు రావాల్సి ఉంది. వీటి కోసం ఎస్‌ఎస్‌ఏ ఇంజినీరింగ్ అధికారులు ఎదురుచూడటం మినహా చేసేదేమీ లేక మిన్నకుండిపోతున్నారు. అవసరమైన పనులకు అంచనాలు తయారుచేయడంతోపాటు పరిపాలనాపరమైన అనుమతులు వచ్చినప్పటికీ నిధుల లేమితో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మొదలైన పనుల పరిస్థితి ఉండగా, కొత్తవి ప్రారంభానికి నోచుకోవడం లేదు. గత ఆర్థిక సంవత్సరం (2017-18)లో జిల్లా వ్యాప్తంగా 63 మండలాల్లోనూ మొత్తం 106 తరగతి గదుల భవన నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం రూ.9 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసి నివేదికలు సమర్పించారు. అలాగే 81 మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.1.59 కోట్లు, తరగతి గదుల మరమ్మతులకు రూ.60 లక్షలు అవసరం. అయితే ఈ నిధులు ఇంత వరకూ విడుదల కాలేదు. అలాగే 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.4.50 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ ఏడాది జిల్లా వ్యాప్తంగా 55 తరగతి గదుల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతి రాగా, వాటిలో 25 భవన నిర్మాణాలకు నిధులు అసలు రాలేదు. అరకొరగా వచ్చిన నిధులతో మిగతా వాటి పనులు మొదలుపెట్టినా ఇంకా రూ.2.70 కోట్లు ఇప్పటికీ అందలేదు. అలాగే జిల్లాలో వివిధ మండలాల్లో 43 ఎమ్మార్సీ భవనాల నిర్మాణాలకు రూ.1.80 కోట్లు రావాల్సి ఉంది. వీటన్నింటినీ సకాలంలో ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఇటు నిధులు రాక కాంట్రాక్టర్లు ఇబ్బందులుపడుతుండగా, అటు భవనాలకు మరమ్మతుల్లేక, ఉన్న గదులు చాలక, కొత్త గదులు లేక విద్యార్థులు కాలం గడుపుతున్నారు. ప్రభుత్వం ఎస్‌ఎస్‌ఏ కింద జిల్లా పాఠశాలలకు, ఎమ్మార్సీ భవనాలకు రావాల్సిన నిధులు విడుదల చేస్తే పనులు వేగవంతమవుతాయని చెప్పొచ్చు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంచనాలకు కూడా నిధులు తోడైతే పెండింగ్ నిధులు పేరుకుపోయే పరిస్థితి నెలకొంటుందడనడంతో సందేహం లేదు. నిధుల కోసం తాము ఎదురుచూస్తున్నామని ఎస్‌ఎస్‌ఏ ఇంజినీరింగ్ విభాగం అధికారులు పేర్కొంటున్నారు.