అనంతపురం

బాలల న్యాయ చట్టాన్ని కఠినంగా అమలుచేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, సెప్టెంబర్ 24: రాష్ట్రంలోని బాలల సంరక్షణ కేంద్రాలన్ని తప్పనిసరిగా ఈ నెలఖారులోపు నమోదు చేసుకోవాలని, బాలల న్యాయ చట్టాన్ని కఠినంగా అమలుచేస్తామని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కమిషనర్ అరుణ్‌కుమార్ తెలిపారు. సోమవారం విజయవాడ నుండి ప్రత్యేక కమిషనర్ జిల్లా అధికారులతో దూర వీక్షణతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్, బీహార్‌లోని బాలల సంరక్షణ కేంద్రాల్లో (సీపీఐ)చోటు చేస్తున్న సంఘటనలతో సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాయన్నారు. తనిఖీల ప్రక్రియ నిరంతరం సాగుతుందన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి సీపీఐలను తప్పసనిసరిగా తనిఖీలు చేయాలన్నారు. రాష్ట్రంలోనే ఒంగోలు, కడప, విశాఖపట్నంలలో తనిఖీ బృందం కొన్ని తప్పులను గుర్తించిందన్నారు. బాలలపై జరిగే అన్యాయాలను నమోదు చేసుకుని జిల్లాస్థాయిలో సీపీఐ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. దత్తత ప్రక్రియలో జిల్లా ఆదర్శంగా వుందని ప్రశంసించారు. అనాథ బాలలను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యతన్నారు. అనుమతి వున్న సీపీఐలలో 47 మంది పిల్లలను దత్తతకు అర్హులుగా గుర్తించామని, 15 మందిని ఇప్పటికే కేరింగ్స్ వెబ్‌సైట్‌లో నమోదు చేశామన్నారు.