అనంతపురం

వైభవంగా శత చండీ యాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉరవకొండ, సెప్టెంబర్ 24: జిల్లాలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన పెన్నోబిళంలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సమీపంలోని టీటీడీ కళ్యాణమండపంలో సోమవారం అత్యంత వైభవంగా శ్రీ శత చండీ యాగం నిర్వహించారు. శత చండీ మాతాదేవి మూలవిరాట్‌కు వివిధ పుష్పాలతో అలంకరణ చేశారు. అనంతరం శత చండీ దేవికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. శత చండీయాగ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శ్రీ జగద్గురు శంకర దత్తాత్రేయ మహాసంస్థాన పీఠాధిపతి విద్యానరసింహభారతి స్వామి ఆధ్వర్యంలో శత చండీ యాగాలు నిర్వహించారు. శత చండీయాగం, రుద్రహవనము, మూలమంత్ర హవనము, తత్త్వ హవనము, శాంతి పౌష్టిక హోమాలు, బలిప్రదానము, పూర్ణాహుతి, రుత్విక సన్మానము, గురుపూజనము, మహదాశీర్వాదమువంటి కార్యక్రమాలను నిర్వహించారు. శత చండీ యాగాన్ని తిలకించడానికి భక్తులు నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చండీమాత దేవికి పూజలు నిర్వహించారు. విద్యానరసింహస్వామి వారి ఆశీస్సులను పొందారు.

ఎంపీఆర్ డ్యాం దక్షిణ కాలవకు
నీరు విడుదల
గార్లదినె్న, సెప్టెంబర్ 24: మండల పరిధిలోని మిడ్ పెన్నార్ డ్యాం నుండి దక్షిణ కాలవ ద్వారా ఆయకట్టుకు సాగునీరు విడుదలను సోమవారం ప్రభుత్వ విప్ యామినీ బాల, ఎమ్మెల్సీ శమంతకమణిలు ప్రత్యేక పూజలు నిర్వహించి గేట్లు ఎత్తి నీరు విడుదల చేశారు. దక్షిణ కాలవకు నీరు విడుదల చేసేందుకు స్థానిక నాయకులతోపాటు హెచ్‌ఎల్‌సి ఆయకట్టు చైర్మన్లు, అధ్యక్షులతో కలసి డ్యాం వద్దకు చేరుకున్నారు. అయితే డ్యాంలో నీరు తక్కువగా ఉండండంతోపాటు దీనికితోడు సాంకేతిక లోపం వల్ల సుమారు గంటసేపు గేట్లు మొరాయించాయి. దీంతో ప్రభుత్వ విప్ యామినీ బాల, ఎమ్మెల్సీ శమంతకణి వెంటే ఎస్‌ఈ, డీఈ, సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. వారి నుండి సరైన స్పందన లేకపోవడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యాంలోకి నీరు నింపాలని గత మూడు నెలల నుండి చెబుతున్నా డ్యాంలోకి నీరు ఎందుకు నింపలేదని అధికారులపై మండిపడ్డారు. అక్కడి నుండి నేరుగా జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంకు వెళ్లి అక్కడ నిరసన వ్యక్తం చేశారు.