అనంతపురం

నీరు-చెట్టుకు పోటీపోటీగా ప్రతిపాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఏప్రిల్ 25: నీరు-చెట్టు, పంట సంజీవిని కార్యక్రమంపై జిల్లా నేతలు పోటాపోటీగా ప్రతిపాదనలు తయారుచేసి జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావుకు నివేదికలు అందజేశారు. ఈ నివేదికలతో సోమవారం రాత్రి గంటాతోపాటు జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి (వాసు) హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. ప్రతి నియోజకవర్గంలో గ్రూపులుగా విడిపోయిన నేతలు కుప్పలు తెప్పలుగా ప్రతిపాదనలు తయారుచేసి జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటాకు అందజేశారు. గతంలో పనులుచేపట్టిన చెరువులు, కుంటలు ,ప్రాజెక్టుల కిందనే మళ్లీ పనులు చేపట్టేందుకు కొందరు ప్రతిపాదనలు తయారు చేసినట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 3వేల 228 నీటి ఆదరవు ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో 215 పెద్ద చెరువులు, 661 కుంటలు, 1450 చెక్‌డ్యామ్‌లు ఉన్నాయి. గతఏడాది డ్వామా ఆధ్వర్యంలో రూ.166కోట్లు ఖర్చుచేసి వాటిని ఆధునీకరించారు. చెరువులు, కుంటల్లో పూడికలు తీసి పంట పొలాలకు వేసుకున్నారు. అయితే ఏ చెరువులో ఇంతవరకు పూర్తిస్థాయిలో మట్టి, కంపలు తొలగించలేదు. కేవలం వాటర్ షెడ్లు, ఉపాధిహామీ, పంచాయతిరాజ్ శాఖల కింద చేసిన పనినే పలు మార్లు చేస్తున్నారే తప్ప పూర్తిస్థాయిలో పనులు చేయలేదు. సోమవారం ముఖ్యమంత్రి పర్యటనలో రామాపురం మండలం బిల్లగుట్ట చెరువులో పంట సంజీవిని పథకం కింద వివిధ రకాల పనులు చేపట్టేందుకు )తాజాగా రూ.10లక్షలు మంజూరు చేశారు. ఇప్పటికే రూ.10లక్షలు ఆ చెరువుకు ఖర్చు చేశారు. వైకాపా నుంచి ఇటీవల పార్టీలో చేరిన జమ్మలమడుగు, బద్వేలు ఎమ్మెల్యేలు సి.ఆదినారాయణరెడ్డి, పి.జయరాములు కూడా ప్రతిపాదనలు అందజేశారు. బద్వేలులో గత ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చవిచూసిన ఎన్‌డి విజయజ్యోతి, మాజీ ఎమ్మెల్యే కె .విజయమ్మలు కూడా ప్రతిపాదనలు తయారుచేసి మంత్రికి ఇచ్చారు.

రాయలసీమను రతనాలసీమగా మారుస్తా

రాయచోటి/రామాపురం, ఏప్రిల్ 25: రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం రామాపురం మండలం బిల్లిగుట్టచెరువులో నీరు - చెట్టు కార్యక్రమంలో సిఎం పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జీవరాసులన్నింటికి నీరు జీవనాధారమని, అలాంటి నీటిని కాపాడుకోవాల్సిన అవసరం మన అందరిపైనా ఉందన్నారు. నీటి కోసం చాలా దేశాల్లో యుద్దాలు కూడా జరిగాయని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు రాయలసీమను కరువు సీమగా మార్చాయని దుయ్యబట్టారు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గతంలో బిల్లిగుట్టచెరువుకట్ట పటిష్టానికి 10 లక్షలు ఇచ్చామని, ప్రస్తుతం ఇదే చెరువు పూడికతీత పనులకు పది లక్షలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఏడాదిలోనే చిన్నమండెం మండలంలోని శ్రీనివాసపురం రిజర్వాయర్‌కు నీటిని తెప్పిస్తానని ఆయన చెప్పారు. గోదావరి నది నుంచి కృష్ణాడెల్టాకు నీటిని అనుసంధానించిన ఘనత తెలుగు దేశం ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 4వేల 500 కిలో మీటర్ల సిమెంటు రోడ్లు వేశామని, ఈ ఏడాది 5వేల కిలో మీటర్లు సిమెంటు రోడ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. అదే విధంగా మే నెలలో పేజ్ - 2 కింద రైతులకు రుణ మాఫీ, జూన్ నెలలో డ్వాక్రా మహిళలకు పేజ్ -2 కింద రూ.3వేల జమ చేయడం జరుగుతుందని సిఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసులు, రాజ్యసభ సభ్యుడు సి ఎం రమేష్, శాసన మండలి డిప్యూటి చైర్మన్ సతీష్ రెడ్డి, జిల్లా టిడిపి అధ్యక్షులు శ్రీనివాసుల రెడ్డి, పౌరసరఫరాల శాఖ చైర్మన్ లింగారెడ్డి, కలెక్టర్ కెవి రమణ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి కూలీ పెంచండి
ఉపాధి కూలీ పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నల్లగుట్టపల్లె ఉపాధి కూలీలు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు నల్లగుట్టపల్లెలో ఎన్ని శ్రమశక్తి గ్రూపులు ఉన్నాయనిఅడిగి తెలుసుకున్నారు. 72 గ్రూపులు ఉన్నట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు రఘునాధ, రాణా ప్రతాప్‌లు తెలిపారు. ఒక్కొ గ్రూపు నుంచి రెండు గుంతలు తవ్వించాలని చంద్రబాబు నాయుడు సూచించారు. అనంతరం పంట సంజీవని గుంతలను ఆయన పరిశీలించారు. నల్లగుట్టపల్లెకు చెందిన నాగరాణి అనే మహిళతో మాట్లాడుతూ ఉపాధి కూలీ సరిగా అందుతుందా అని ప్రశ్నించారు. ఉపాధి కూలీ పెంచాలని నాగరాణి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వచ్చారు. అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో బివి రత్నం, జిల్లా టిడిపి మహిళా ప్రధాన కార్యదర్శి సుజాత పాల్గొన్నారు.