అనంతపురం

ఆరు నిమిషాల్లో సైబర్ నేరాలు పరిష్కరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వజ్రకరూరు, నవంబర్ 13 : జిల్లావ్యాప్తంగా బెట్టింగ్‌రాయుళ్ల భరతం పట్టడంతోపాటు సైబర్ నేరాలు జరిగిన వెంటనే తమ దృష్టికి తీసుకొస్తే ఆరు నిమిషాల్లో పరిష్కరిస్తామని ఎస్పీ అశోక్‌కుమార్ స్పష్టం చేశారు. 2019 రాబోవు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్లను తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా వజ్రకరూరు స్టేషన్‌ను పరిశీలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఇసుక రవాణాపై ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే ఎవరైనా నిల్వ ఉంచి వ్యాపారం చేస్తే ఎంతటి వారినైనా కఠినంగా శిక్షిస్తామన్నారు. అలాగే మట్కా, గ్యాంబ్లింగ్, బెట్టింగ్, అమ్మాయిలను వేధించడం లాంటివి తమదృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం వర్షాలు సకాలంలో కురవక గ్రామీణ ప్రాంతాల్లో పంటలు పండక, పనులు లేక చిన్న చిన్న నేరాలు, ఘోరాలు జరిగే అవకాశం ఏర్పడుతుందన్నారు. అలాగే జిల్లావ్యాప్తంగా రోడ్లపై స్పీడ్ నియంత్రణ బోర్డులు ఉంచి, డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్ ద్వారా ప్రమాదాలు నివారిస్తామన్నారు.