అనంతపురం

ఎంపీ, ఎమ్మెల్యేలు సుడిగాలి పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్లూరు, నవంబర్ 13 : ఓట్లు నాకే వేయండి అని నేను అడగడం లేదు, పార్టీలకు సంబంధం లేకుండా అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని అనంత ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం శింగనమల నియోజకవర్గంలోని పుట్లూరు మండలంలోని మడుగుపల్లి, జంగంరెడ్డిపల్లిపేట గ్రామాలలో ఎంపీ దివాకర్‌రెడ్డి, శింగనమల ఎమ్మెల్యే యామినీ బాల ఇరువురు సుడిగాలి పర్యటన చేశారు. జంగంరెడ్డిపేట గ్రామంలో సుమారు రూ.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా అనంత ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ మడుగుపల్లి, ఎల్లుట్ల, జంగంరెడ్డిపేట గ్రామాలకు నీటిని అందిస్తానని మాట ఇచ్చాను. భూగర్భ జలాలు అడుగంటిపోయి మూడు గ్రామాల్లో నెలకొన్న నీటి ఎద్దడి గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి సుమారు రూ.17 కోట్లతో చెరువులకు, కుంటలకు నీటిని అందించాలని వత్తిడి తెచ్చామన్నారు. కానీ ప్రభుత్వం టెండర్లు పిలిచి పనులు ప్రారంభించే సరికి మనకు వస్తున్న హెచ్‌ఎల్‌సీ నీరు సమయం కాస్త ముగియడంతో సొంత ఖర్చులు భరించి మోటారు పైపుల ద్వారా నీటిని అందించేలా చర్యలు తీసుకుంటానని గ్రామాల ప్రజలకు తెలిపారు.

రాజీవ్ కాలనీలో విజిలెల్స్ దాడులు
* 180 బ్యాగుల చౌక బియ్యం పట్టివేత
అనంతపురం, నవంబర్ 13: జిల్లా నిఘా మరియు అమలు విభాగం ఆధ్వర్యంలో స్థానిక రెవెన్యూ అధికారులతో కలసి రాజీవ్ కాలనీలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు అధికారి రామాంజనేయులు తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు డోర్ నెం. 11-71-ఏ ఇంటిని తనిఖీ చేయగా 180 బ్యాగుల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించామన్నారు. లక్ష్మినారాయణ, తిరుపాల్‌శెట్టిలు రేషన్ కార్డుదారుల నుండి పీడీఎస్ బియ్యాన్ని రూ. 10లు, 12లకు కొనుగోలు చేసి పై ఇంటిలో నిల్వ ఉంచి, దీపక్ బ్రాండ్ బెస్ట్ క్వాలిటీ రైస్ అనే పేరు గల సంచులలోకి మార్చి ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు గుర్తించారు. వెంటనే అధికారులు 180 బ్యాగుల బియ్యంను సీజ్ చేసి, యజమానులలో ఒకరైన లక్ష్మీనారాయణను సంబంధిత రెవెన్యూ అధికారులకు నిత్యావసర వస్తువుల చట్టం 1955 మేరకు చర్యలకై అప్పగించినట్లు ఆయన తెలిపారు. ఇద్దరిపైన కేసు నమొదుకు 3వ పట్టణ పోలీసులకు సిఫారసు చేసినట్లు ఆయన తెలిపారు.

కృష్ణాజలాలతో నీటమునిగి పంటలు
* ఆందోళనల్లో అన్నదాతలు
బెళుగుప్ప, నవంబర్ 13 : మండలంలోని చెరువులకు కృష్ణాజలాలు వస్తే భూగర్భజలాలు పెరిగి పంటలు సాగు చేసుకోవచ్చన్న రైతులు ఆశలు అడియాశలు అవుతున్నాయి. జీడిపల్లి రిజర్వాయర్ సమీపంలోని అంకంపల్లి వద్ద ఉన్న 10వ పంప్‌హౌస్ నుంచి సీర్పి చెరువుకు నీరు విడుదల చేసిన విషయం తెలిసిందే. వారం తిరిగే సరికి సీర్పి చెరువుకు పూర్తిస్థాయిలో నీరు చేరింది. దీంతో గ్రామానికి చెందిన బలరాముడు, వన్నూర్‌స్వామి, పాతప్ప, మరికొంతమంది రైతులు సాగు చేసిన దాదాపు 20 ఎకరాలకుపైగా మిరప, పప్పుశెనగ పంటలు నీట మునిగాయి. దీంతో రైతులకు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గత సోమవారం గ్రీవెన్స్‌లో కూడా బాధిత రైతులు తహశీల్దార్ బాలకిషన్‌ను కలిసి న్యాయం చేయాలని విన్నవించారు. ప్రస్తుతం సీర్పి చెరువుకు హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు నీటిని నిలుపుదల చేశారు. ప్రభుత్వ, అధికారులు స్పందించి నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని కోరుతున్నారు.