అనంతపురం

ప్రజాసంక్షేమమే చంద్రబాబు ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయదుర్గం, నవంబర్ 13 : రాష్ట్రంలో ప్రజాసంక్షేమమే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయమని మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం మండలంలోని బొమ్మక్కపల్లి, ఆవులదట్ల గ్రామాల్లో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో మంత్రి ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసంక్షేమం కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే పింఛన్లు, పక్కా గృహాలు వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు. విభజన అనంతరం లోటుబడ్జెట్ వేధిస్తున్నప్పటికీ ప్రజాసంక్షేమం, రాష్ట్భ్రావృద్ధికి చంద్రబాబు పెద్దపీట వేశారని తెలిపారు. మహిళా స్వయం సహాయక బృందాలకు సబ్సిడీ రుణాల మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఆవులదట్ల గ్రామంలో స్కాలర్‌షిప్‌లకు రూ.67లక్షల దాకా విడుదల చేశామన్నారు. 117 రకాల వివిధ పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు.

అధికారులతో సమీక్ష
నిర్వహించిన మంత్రి, కలెక్టర్
ఆత్మకూరు, నవంబర్ 13: జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పేరూరు డ్యాం కాలువ నిర్మాణ ప్రగతిపై మంత్రి పరిటాల సునీత, కలెక్టర్ వీరపాండ్యన్, జేసీ ఢిల్లీరావు, భూ సేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ వెంకటనారాయణమ్మ, ఇరిగేషన్ శాఖాధికారులు, కళ్యాణదుర్గం, ధర్మవరం ఆర్డీఓలు, నియోజకవర్గ పరిధిలోని రెవెన్యూ శాఖాధికారులతో మంగళవారం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. 2 నెలల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 9 నెలల సమయంలో కాలువ నిర్మాణం పనులు పూర్తిచేయాలన్న ఆలోచనతో శంఖుస్థాపన చేశారని, ఇప్పటివరకు పనులు నత్తనడకన సాగాయని, సీఎం సూచించిన సమయానికి కాలువ నిర్మాణం ఎలా పూర్తి చేయాలన్న దానిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో కెనాల్ నిర్మాణం కోసం వెయ్యి ఎకరాలు, రిజర్వాయర్ ఏర్పాటు కోసం 300 ఎకరాల భూ సేకరణ అంశంపై ఎంతవరకు ముందడుగు వేసిందీ వివరించమని అధికారులను కలెక్టర్ అడిగారు. 54 కి.మీ. పొడవు 13 రెవెన్యూ గ్రామాల పరిధిలో కాలువ నిర్మాణం జరుగుతుందని జేసీ ఢిల్లీరావు వివరించారు. మొత్తం 749 మంది రైతుల వద్ద నుంచి కాలువ నిర్మాణానికి భూ సేకరణ చేస్తున్నామని ఇందులో ఎక్కువ భాగం భూమి ఆత్మకూరు మండల పరిధిలోనే కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతులకు సంబంధించి భూమికి ఈ నెలాఖరులోగా ఎక్కువ మందికి డబ్బు చెల్లిస్తామన్నారు. ఆత్మకూరు భూములకు రూ.8.2 లక్షలు ఎకరాకు ధర చెల్లించడానికి కలెక్టర్ ముందుకు వచ్చారు. ఆత్మకూరు రైతులు ఈ ధరకు ఇంచుమించు అంగీకరించారు. మానిరేవు పొలంలో భూములున్న ఆత్మకూరు రైతులకు మాత్రం రూ.5 లక్షలు నిర్ణయించారు. ఇక్కడ 19 ఎకరాలు భూ సేకరణ చేశారు. ఈ ధరకు భూములు ఇవ్వడానికి రైతులకు మనస్కరించలేదు. కాలువ అవసరమైతే తవ్వుకోండి, ఈ ధర మాకిష్టం లేదని రైతులు అసంతృప్తితో వెనుదిరిగారు. కనీసం రూ.8 లక్షలు చెల్లించాలని రైతులు తమ డిమాండ్‌ను అధికారుల ముందుంచి వెళ్ళిపోయారు. ఆత్మకూరు మినహా మిగిలిన అన్నిచోట్ల భూమికి రూ.4.5 లక్షల నుంచి 8.2 లక్షల మధ్యలో ధర చెల్లించడానికి జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఇకపై ప్రతి రోజు ఎంత దూరం కాలువ నిర్మాణం పని జరుగుతున్నది నివేదిక ఇవ్వాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పట్టా భూములు, అసైన్డ్ భూములు కాకుండా రిజిస్టర్ కాని భూములకు సంబంధించి ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే తనకు తెలియజేయాలని రెవెన్యూ శాఖాధికారులను ఆదేశించారు. ఇంతవరకు ఏ మండల పరిధిలో ఎంత భూమి సేకరించినది అందుకు సంబంధించిన లావాదేవీలు ఎంతవరకు పూర్తిచేశారన్న విషయాన్ని అధికారుల ద్వారా తెలుసుకున్నారు. కొన్నిచోట్ల వెబ్‌లో ఒకరి పేరున అనుభవంలో మరొకరి పేరున భూములున్న విషయాలు భూసేకరణ, నగదు చెల్లింపులకు ఎదురయ్యే సమస్యలను తహశీల్దార్లు జిల్లా అధికారుల ముందుంచారు. రైతులందరికీ న్యాయం చేయడానికి రైతులకు సంపూర్ణ సహకారం అందించాలని మంత్రి పరిటాల సునీత అధికారులకు సూచించారు.