అనంతపురం

జన్మభూమి కమిటీలను రద్దు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొమ్మనహాల్, ఏప్రిల్ 26 : అభివృద్ధికి ఆటంకంగా మారిన జన్మభూమి కమిటీలను వెంటనే రద్దు చేయాలని పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని ఉద్దెహాల్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను జన్మభూమి కమిటీ సభ్యులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. కమిటీలను రద్దు చేయడం వల్ల అర్హులకు న్యాయం జరుగుతుందన్నారు. గతంలో 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నోడల్ ఆఫీసర్ వ్యవస్థను తెచ్చి అభివృద్ధికి ఆటంకాలు సృష్టించారని గుర్తు చేశారు. కాగా హెచ్చెల్సీ ఆధునీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.కోట్లు కేటాయిస్తే ప్రస్తుత టిడిపి ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా ఆధునీకరణ పనులు జరపకుండా అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు. గతంలో కర్నాటకలో ఉన్న బిజెపి ప్రభుత్వం తుంగభద్ర జలాశయం నుంచి సరిహద్దు వరకు ఆధునీకరించడానికి అప్పట్లో ఒప్పుకోలేదని, ప్రస్తుతం కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ 105 కిలో మీటర్ల మేర ఆధునీకరణకు ఒప్పుకున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపని కారణంగా రాష్ట్ర బడ్జెట్‌లో ఆధునీకరణకు ఊసే లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని కర్నాటక ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని వృథాగా పోతున్న వందలాది టిఎంసీల నీటిని రాయలసీమకు అందించాలని డిమాండ్ చేశారు. ఇకపోతే ఆర్టీసీ సంస్థను నిర్లక్ష్యం చేసి, ప్రైవేటీకరణకు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. డీజిల్ ధరలు తగ్గుతున్నా బస్సు చార్జీలను పెంచడం ఎంత వరకు సమంజసమన్నారు. కర్నాటక సరిహద్దు మండలాల్లో ఆంధ్ర పెట్రోల్, డీజిల్‌పై అదనంగా రూ.4 వసూలు చేయడం వల్ల పెట్రోల్ బంకులు వెలవెలపోతున్నాయన్నారు. రాబోయో ఎన్నికలకు అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ఈ సమావేశంలో రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చిన్నబ్బ, మాజీ ఎంపిపి లాలూసాబ్, మాజీ సర్పంచ్ మచ్చన్న, అనంతశెట్టి, గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.