అనంతపురం

రామమందిర నిర్మాణం కోట్లాది హిందువుల సంకల్పం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, డిసెంబర్ 9: మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడు జన్మించిన అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాలన్నది కోట్లాది హిందువుల సంకల్పమని వీహెచ్‌పీ తెలంగాణ ప్రచార ప్రముఖ్ తంగేడుకుంట హెబ్బార్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. నగరంలోని శ్రీ విద్యారణ్య ఓరియంటల్ హైస్కూల్‌లో ఆదివారం వీహెచ్‌పీ ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణ సంకల్ప సభ జరిగింది. వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షులు అక్కిశెట్టి జయరాముడు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథులుగా కోనకణ్వాశ్రమం శ్రీ విష్ణుదాస్ స్వామీజీ, జగద్గురు శంకర దత్తాత్రేయ మహాసంస్థాన పీఠం శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి, ముఖ్య వక్తగా హెబ్బార్ నాగేశ్వరరావు హాజరయ్యారు. ముందుగా స్వామీజీలచే భారతమాత పూజ, శ్రీరామ జయరామ జయజయరామ విజయ మహామంత్రం 108సార్లు సామూహికంగా జపించారు. అనంతరం హెబ్బార్ నాగేశ్వరరావు మాట్లాడుతూ త్రేతాయుగంలో జన్మించిన శ్రీరాముడు అధికారాన్ని అనుభవించక, రాజ్యాన్ని ఉపాసించాడని, పూజించాడని, ఆరాధించాడని పేర్కొన్నారు. ప్రజల యొక్క మాట ప్రకారం పాలించిన రాముడు రాజయ్యాడన్నారు. పాలకుడు ఎలా ఉండాలన్నదానికి శ్రీరాముడు ఆదర్శమన్నారు. 16 గుణాలు గల వ్యక్తి శ్రీరాముడన్నారు. అందుకే మహాత్మాగాంధీ కూడా ఈ దేశంలో రామరాజ్యం రావాలని ఆకాంక్షించారన్నారు. మాతృభూమి గరిమను చాటినవాడు, వ్యక్తిహితం కన్న జాతి సుఖం మిన్నగా భావించాడన్నారు. అందుకే ప్రజలు వేల సంవత్సరాలుగా శ్రీరామున్ని పూజిస్తున్నారన్నారు. అయోధ్యలోని రామమందిరాన్ని దురాక్రమణదారుడు బాబర్ 1528లో కూల్చి వేశాడన్నారు. మందిర నిర్మాణం కోసం నాటి నుండి నేటి వరకు 77సార్లు పోరాటాలు జరిగాయన్నారు. సుప్రీం కోర్టు తీర్పు వెలువరించడంలో ఆలస్యం చేస్తోందని, ప్రభుత్వం వెంటనే స్పందించి రానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మందిర నిర్మాణంకై చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. మందిర నిర్మాణం కోసం రామ భక్తులు సంకల్పం తీసుకోవాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. స్వామీజీలు మాట్లాడుతూ రామజన్మభూమిలో భవ్యమైన రామ మందిర నిర్మాణం జరగాలని ప్రతి హిందువు సంకల్పించాలన్నారు. భక్తులచే సంకల్పం చేయించారు.