అనంతపురం

ఎత్తులకు పైఎత్తులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, డిసెంబర్ 9 : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం, వైకాపా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తమ బలాన్ని పెంచుకునేందుకు పావులు కదుపుతున్నాయి. ప్రధానంగా హిందూపురం పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో టీడీపీకి కంచుకోటలుగా ఉంటున్న పెనుకొండ, హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గాలపై వైకాపా అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఇటీవలే పెనుకొండ నియోజకవర్గ పరిధిలోని పరిగి మండలం బీచుగానిపల్లికి చెందిన మాజీ సర్పంచ్ బాలాజీ వైఎస్ జగన్ సమక్షంలో వైకాపాలోకి చేరారు. బీచుగానిపల్లి పంచాయతీతోపాటు పరిగి మండలంలో కొంతబలం కలిగిన బాలాజీని వైకాపాలోకి చేర్చుకోవడం ద్వారా ఆ నియోజకవర్గ సమన్వయకర్త శంకరనారాయణ సఫలమయ్యారు. దీనికితోడు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ న్యాయవాది నాగేశ్వరి కొద్ది రోజుల క్రితం వైకాపాలోకి చేర్పించడం ద్వారా కూడా శంకరనారాయణ ఆ సామాజిక వర్గం పరంగా పావులు కదుపుతున్నారు. నాగేశ్వరి తండ్రి నాగేశం ప్రముఖ పేరుమోసిన న్యాయవాది కాగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇకపోతే ఎమ్మెల్యే, జిల్లా టీడీపీ అధ్యక్షులు బీకే పార్థసారధి కూడా తమ పార్టీలోకి వైకాపా నాయకులను చేర్చుకునేందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావు కూడా తమ పార్టీలోకి వైకాపా, కాంగ్రెస్ తదితర పార్టీల నాయకులను చేర్పించుకునేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా కిరికెర సింగిల్‌విండో అధ్యక్షులు, కాంగ్రెస్ నేత బేవినహళ్లి ఆనంద్‌కుమార్‌తోపాటు ఆయన సతీమణి, బేవినహళ్లి మాజీ సర్పంచ్ మాలతీ ఆదివారం జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారధి సమక్షంలో పచ్చకండువా వేసుకున్నారు. స్వయానా ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పావులూరి శ్రీనివాసరావు ఆనంద్ దంపతులను వెంటబెట్టుకొని బీకే స్వగ్రామం రొద్దం మండలం మరవపల్లిలో టీడీపీలోకి చేర్పించారు. ఇకపోతే బేవినహళ్లి ఆనంద్ సార్వత్రిక ఎన్నికల అనంతరం టీడీపీలోకి చేరాలని భావించినప్పటికీ ఆయన్ను విభేదిస్తున్న సీనియర్ టీడీపీ నాయకులు అడ్డుకట్ట వేశారు.
మాజీ ఎమ్మెల్యే అబ్ధుల్‌ఘనీ వైకాపాలోకి చేరడంతో ఆ పార్టీ ఇన్‌చార్జి శ్రీనివాసరావు దృష్టి పెట్టి బలం ఉన్న ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలోకి చేర్పించుకొనేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. ఆనంద్ చేరికను మండల సీనియర్ టీడీపీ నాయకులు అభ్యంతరం చెబుతారని భావించి నేరుగా మరవపల్లికి తీసుకెళ్లి జిల్లా టీడీపీ అధ్యక్షుడి సమక్షంలో పార్టీలో చేర్పించారు. కాగా బేవినహళ్లి ఆనంద్ టీడీపీలోకి చేరడంతో ఆయన్ను ముందు నుండి విభేదిస్తున్న కొందరు ఆ పార్టీ మండల సీనియర్ నాయకులపై వైకాపా తాజాగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పలు నియోజకవర్గాల్లో ఇప్పటికే వలసలు జోరందుకొంటున్నాయి.
టీడీపీలో ఘనీ తోడల్లుడికి ప్రమోషన్
టీడీపీకి గుడ్‌బై చెప్పి వైకాపాలోకి చేరిన స్థానిక మాజీ ఎమ్మెల్యే అబ్ధుల్‌ఘనీ తోడల్లుడికి టీడీపీ పెద్దపీట వేసింది. ఘనీ తోడల్లుడు వక్కల్ అబుబకర్‌ను టీడీపీ జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షునిగా నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు స్థానిక ఆ పార్టీ ఇన్‌చార్జి శ్రీనివాసరావు తెలిపారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు అబుబకర్‌ను ఆ పదవికి ఎంపిక చేసినట్లు తెలిపారు.