అనంతపురం

మందుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం టౌన్, డిసెంబర్ 12: జిల్లాలో నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న మందుల దుకాణాలపై బుధవారం విజిలెన్స్ శాఖ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ అధికారి రామాంజినేయులు ఆధ్వర్యంలో అధికారులు నాలుగు బృందాలుగా విడిపోయి అనంతపురం, హిందూపురం, ధర్మవరం, కదిరి ప్రాంతాల్లోని మందుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామాంజినేయులు మాట్లాడుతూ, నిబంధనల ప్రకారం మందుల దుకాణ నిర్వహణ సమయంలో విధిగా ఫార్మసిస్టు అందుబాటులో ఉండాల్సి ఉందని, అయితే చాలా దుకాణాల్లో ఫార్మసిస్టులు లేకపోయిన విషయాన్ని గుర్తించామన్నారు. అదేవిధంగా అనేక దుకాణాల్లో కాలం చెల్లిన మందులు నిలువ ఉన్నాయని, వైద్యుల సూచనలు లేకుండానే మందులు విక్రయిస్తున్నారని తెలిపారు. దీనికితోడు అత్యల్ఫ ఉష్ణోగ్రతలో ఉండాల్సిన మందులు బయట ఉంచారని, హెచ్, హెచ్ 1 రిజిస్ట్రర్ల నమోదు ఏమాత్రం సక్రమంగా లేదని తెలిపారు. ముఖ్యంగా సెరిలాక్, గ్లూకాన్ విక్రయానికి ఆహార చట్టం కింద అనుమతి పొందాల్సి ఉండగా అలాంటి అనుమతులు లేకుండానే అనేక మందుల దుకాణాల్లో విక్రయాలు సాగిస్తున్నట్లు తెలిపారు. విజిలెన్స్ అధికారుల తనిఖీ సమయంలో సరైన అమ్మకం వివరాలను తెలియచేయకపోవడంతో అనంతపురంలో ఆరు, హిందూపురం, కదిరిలో నాలుగు చొప్పున, ధర్మవరంలో ఐదు మందుల దుకాణాలపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు.