అనంతపురం

లోపాలను సరిదిద్దుకుని మెరుగైన సేవలందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం టౌన్, జనవరి 23 : స్థానిక ప్రభుత్వాసుపత్రిలో నెలకొన్న చిన్నపాటి లోపాలను సరిదిద్దుకుని మెరుగైన వైద్యసేవలు అందించాలని జాతీయ ప్రమాణాల ఆచరణ కమిటీ బృందం సభ్యులు పొన్నురాజు, నాగరాజు, మినీవౌలా సూచించారు. మూడు రోజులుగా స్థానిక ప్రభుత్వాసుపత్రిలోని అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బుధవారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ, వైద్యులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చిన్నపాటి లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆసుపత్రి నిర్వహణ, వైద్య చికిత్సలు అందిస్తున్న తీరు తదితర అంశాలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. తొలి రోజున వైద్యుల నిర్లక్ష్యం కనిపించిందన్నారు. ఆసుపత్రిలోని 14 విభాగాలను పరిశీలించామని, ఇందులో రక్తనిధి, దోబీలకు సంబంధించి పలు సమస్యలు కనిపించాయన్నారు. వాటిని సరి చేసుకోవాల్సి ఉంటుందన్నారు. జాతీయ ప్రమాణాల ఆచరణ బృందం ఆధ్వర్యంలో తయారు చేసిన నివేదికలను త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలిపారు. ఎంపికైన ఆసుపత్రిలో ఒక్కో బెడ్‌కు రూ.10 వేల వంతున ఏడాదికి రూ.20 లక్షల వంతును మూడేళ్లకు రూ.60 లక్షలు అందించనున్నట్లు తెలిపారు. ఈ నిధులను ఆసుపత్రి అభివృద్ధికి వెచ్చించడంతోపాటు బాగా పనిచేసే వారికి 25 శాతం మేర ప్రోత్సాహకం కింద అందచేయవచ్చన్నారు. ఆఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ జేఈ వెంకటస్వామి, సూపరింటెండెంట్ డాక్టర్ కేశవులు మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వాసుపత్రిలో ఏడాదికి 10 లక్షల మందికిపైగా వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

పేదల అభ్యున్నతే ఆర్డీటీ ధ్యేయం
పరిగి, జనవరి 23 : పేదలను అన్నివిధాలా ఆదుకునేందుకు ఆర్డీటీ సంస్థ కృషి చేస్తోందని సంస్థ ప్రోగ్రాం డైరెక్టర్ మంచూ ఫెర్రర్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని ఎర్రగుంటలో ఆర్డీటీ సహకారంలో నిర్మించిన 36 ఇళ్లను స్పెయిన్ దేశీయులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్డీటీ సంస్థ పేదలను అభివృద్ధి చేసి వారి కళ్లలో ఆనందం చూడటమే లక్ష్యమన్నారు. ముఖ్యంగా వైద్యం, విద్యతోపాటు పునరావాసం కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించి విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్నారు.