అనంతపురం

వైభవోపేతంగా రథ సప్తమి పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, ఫిబ్రవరి 12: నగరంలోని పలు వైష్ణవ ఆలయాలలో మంగళవారం రథ సప్తమి పూజలు వైభవంగా నిర్వహించారు. మారుతీనగర్, ఆర్.ఎఫ్ రోడ్డులోని శ్రీ లక్ష్మివేంకటేశ్వర దేవాలయాలలో వేకువజామున స్వామివారి మూల విరాట్‌కు పవిత్ర జలాలతో, సుగంధ ద్రవ్యాలతో, అభిషేకాలను వేద పండితులు నిర్వహించారు. ఈసారి రథ సప్తమికి మరింత ప్రత్యేకత ఉంది. కుజుడితో కలిసి చంద్రుడు రావడంతో సూర్యభగవానుడికి విశేష పూజలు చేసారు. ఇలాంటి రథ సప్తమి 30 ఏళ్ల తర్వాత రావడం జరుగుతుందని పండితులు తెలిపారు. అలాగే భక్తులు జిల్లేడు ఆకులు, రేగు ఆకులు తలమీద పెట్టుకొని స్నానం చేస్తూ సూర్యనికి ఆర్ఘ్యం వదిలారు. ఇలా చేయడం వలన ఏడు జన్మాల్లో చేసిన పాపములు నశిస్తాయని భక్తులు విశ్వాసం. ఉదయం నుండి భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ సూర్య నమస్కారాలు చేసారు. సాయంత్రం సూర్యభగవానుని పూల రథంలో ఆశీనులు చేసి నగరోత్సవం కనుల పండువగా సాగింది. అలాగే వివేకానంద యోగా కేంద్రం అధ్వర్యంలో స్థానిక ఆర్ట్స్ కళాశాలలోఉదయం 5గం.ల నుండి సామూహిక సూర్య నమస్కారాలు నిర్వహించారు. ప్రతిసారి 12 ఆసనాలు వేస్తూ 108సార్లు నమస్కారాలు చేసారు.
సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన ఖాద్రీశుడు
కదిరి టౌన్, ఫిబ్రవరి 12: శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రతసప్తమి సందర్భంగా మంగళవారం స్వామివారికి విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సూర్యప్రభ వాహనంపై శ్రీవారిని విశేష అలంకరణలతో మంగళవాయిద్యాల మధ్య తిరువీధులగుండా ఊరేగించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అర్చకులు పార్థసారథిచార్యులు, నరసింహాచార్యులు ప్రత్యేక పూజలు చేసి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
వైభవంగా వీరభద్రస్వామి అగ్నిగుండ మహోత్సవం
మడకశిర, ఫిబ్రవరి 12 : పట్టణంలోని గాంధీ బజార్‌లో వెలసిన వీరభద్రస్వామి అగ్నిగుండ మహోత్సవం, రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. రథ సప్తమిని పురస్కరించుకుని సోమవారం రాత్రి 8 గంటల నుంచే గంగపూజ, స్వామి ఆలయ ప్రవేశం, గణపతి పూజ, అగ్ని ప్రతిష్ట వంటి పూజలు చేశారు. అర్ధరాత్రి 1 గంట తర్వాత వీరభద్రస్వామికి మహా రుద్రాభిషేకం నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. అగ్నిగుండం చుట్టూ స్వామివారికి నిప్పులను నైవేధ్యంగా ఉంచి బలిహారం చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో వీరగాసేలు భక్తులను ఆకట్టుకునే విధంగా స్వామివారి పాటలు ఆలపించారు. ఆలయ అర్చకులు నాగరాజు, జంగమర దేవులు వీరభద్రస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి భక్తిశ్రద్ధలతో అగ్నిగుండంలో ప్రవేశించారు. భక్తులు తమ కోర్కెలను తీర్చాలని విశేష పూజలు నిర్వహించారు.