అనంతపురం

రూ.116 కోట్లతో ‘పురం’ మున్సిపల్ బడ్జెట్‌కు ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం టౌన్, ఫిబ్రవరి 12 : హిందూపురం మున్సిపాలిటీకి సంబంధించి 2019-20 సంవత్సరానికి రూ.116 కోట్లతో తయారు చేసిన బడ్జెట్‌కు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు. అయితే వైకాపా సభ్యులు నామమాత్రంగా హాజరై రిజిస్ట్రర్‌లో సంతకాలు పెట్టి సభ ప్రారంభం కాకమునుపే వెళ్లిపోయారు. మున్సిపల్ చైర్‌పర్సన్ రావిళ్ల లక్ష్మి అధ్యక్షతన మంగళవారం జరిగిన బడ్జెట్ సమావేశంలో సీనియర్ అకౌంటెంట్ సునీత బడ్జెట్‌ను చదివి వినిపించారు. సాధారణ ఖర్చుల కింద ఆస్తిపన్నుల నుండి రూ.6.50 కోట్లు రానున్నట్లు అంచనా వేయగా స్టాంప్స్ అండ్ డ్యూటీ నుండి రూ.2.50 కోట్లు, మున్సిపల్ మార్కెట్, వాణిజ్య భవన సముదాయాల నుంచి రూ.1.37 కోట్లు, ట్రేడ్ లైసెన్సుల ద్వారా రూ.37 లక్షలు, టౌన్ ప్లానింగ్ నుండి రూ.3.93 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. దీనికితోడు నీటి పన్ను వసూలు ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2.30 కోట్లు రానున్నట్లు తెలిపారు. అదే విధంగా ఖర్చుల కింద మున్సిపాలిటీలో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, కంప్యూటర్ ఆపరేటర్లు, జూనియర్ అసిస్టెంట్లు, బిల్ కలెక్టర్లు తదితరులకు వేతనాల రూపేణా రూ.7,72,20,000 చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. మున్సిపాలిటీకి అన్ని రకాల వనరుల నుండి స్వంత ఆదాయం రూ.20.20 కోట్లు వస్తుందని, ఈ సొమ్మును మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఇతరత్రా నిర్వహణ ఖర్చులతో కలిపి రూ.20 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అభివృద్ధికి స్వంత నిధులు లేకపోవడంతో ప్రభుత్వం నుండి వచ్చే గ్రాంట్లతోనే అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంది. మూలధన రాబడుల కింద ప్రభుత్వం నుండి రూ.97.33 కోట్లు వస్తాయని అంచనా వేశారు. ఇందులో ప్రధానంగా వృద్ధాప్య పింఛన్లకే రూ.30 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. కాంట్రాక్టర్లు ఇతరత్రా లేబర్ పనులు, రికవరీలు కలిపి రూ.5.68 కోట్లు వస్తాయని, వీటిని ఆ పద్దుల కింద ప్రభుత్వానికి చెల్లింపులు చేయనున్నట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు. కాగా మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ విభాగంలో సిబ్బంది లేకపోవడంతో ఉన్న వారు సక్రమంగా పనిచేయకపోవడంతో లక్షలాది రూపాయల ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోందని మున్సిపల్ వైస్‌చైర్మన్ రోషన్‌అలీ విస్మయం వ్యక్తం చేశారు. కాగా పట్టణంలో వేలాది కేబుల్ కనెక్షన్లు కలిగి ఉన్న కొందరు కేబుల్ ఆపరేటర్లు తక్కువ సంఖ్య చూపి వినోదపు పన్ను సక్రమంగా చెల్లించడం లేదని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించి పూర్తిస్థాయిలో వినోదపు పన్ను వసూలు చేయాలని, సినిమా థియేటర్లను తరచూ తనిఖీ చేయాలని కౌన్సిలర్ దాదాపీర్ కోరారు. ఇకపోతే కొటిపి వద్ద అందరికీ ఇళ్ల పథకంలో ఇళ్ళ నిర్మాణాలు జరుగుతున్నా అక్కడ ప్రజలు నివాసం ఉండేందుకు అవసరమైన వౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా మున్సిపల్ పరిధిలో రూ.66 కోట్లతో వివిధ వార్డుల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నా అందుకు అనుగుణంగా ఎక్కడా పనులు ప్రారంభం కాలేదని దాదాపీర్ అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ఆయా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. కాగా మున్సిపాలిటీలో రూ.46.26 కోట్లు మిగులు చూపించారు.