అనంతపురం

ఘనంగా మాతృభాషా దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఫిబ్రవరి 21: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నగరంలో గురువారం ఘనంగా జరుపుకున్నారు. తెలుగు భాషా సంరక్షణ సమితి అధ్యక్షులు డా. నారాయణ ఆధ్వర్యంలో ఎస్వీ జూనియర్ కళాశాల నుండి సప్తగిరి సర్కిల్ మీదుగా తెలుగు తల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మమీ డాడీ వద్దు - అమ్మా నాన్నా ముద్దు, మాతృభాషను ప్రేమిద్దాం - పరభాషను గౌరవిద్దాం అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ఎక్సైజ్ సీఐ అన్నపూర్ణ ముఖ్య అతిథిగా హాజరై తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాతృభాషను విస్మరిస్తే ఆ భాషను మాట్లాడే ప్రజల ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు కూడా అంతరిస్తాయన్నారు. ప్రతి ఒక్కరు అవసరం కోసం పరభాషను నేర్చుకున్నా ఇంట్లో మాత్రం తప్పక మాతృభాషలోనే మాట్లాడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీ కళాశాల కరస్పాండెంట్ రామమమోహన్, శ్రీ్ధరనాయుడు, నబిరసూల్, కళాశాల సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.కవులు, రచయితల ఆధ్వర్యంలో రచయిత శాంతినారాయణ, బీఎస్‌ఎన్‌ఎల్ రాజశేఖర్‌రెడ్డి, షేక్ రియాజుద్దీన్ అహ్మద్, అశ్వర్థరెడ్డి,ఏలూరి యంగన్న, కృష్ణవేణి, మిద్దెమురళీకృష్ణ, నగరూరు రసూల్ తదితరులు తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. కేంద్ర గ్రంథాలయంలో మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ గౌస్‌మొద్దీన్ తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాష అంతరిస్తే, ఆ జాతి అంతరించినట్లే అన్నారు. మాతృభాషను ప్రతి ఒక్కరు ప్రేమించాలన్నారు. మాతృభాషను పాఠశాలల్లో తప్పనిసరి చేయాలని, ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగు భాషలోనే జరగాలన్నారు.
జేఎన్‌టీయూలో....
అనంతపురం సిటీ : సంస్కృతి, సాంప్రదాయాలు కలిగిన మాతృభాషను యువత మరవకూడదని జేఎన్‌టీయూ ఎంబీఏ విభాగాధిపతి ఆచార్య ఎంఎస్‌ఎస్ దేవకుమార్ పేర్కొన్నారు. గురువారం మాతృభాషా దినోత్సవాన్ని జేఎన్‌టీయూ కాలేజిలోని ఎంబీఏ విభాగంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఏడు వేల భాషలు ఉన్న అందులో 2,800 భాషలకు పైగా అంతరించిపోయే స్థితిలో వున్నాయని, వాటిని కాపాడాలని యునెస్కో కమిటీ నిర్ణయించిందన్నారు. తెలుగు సహాయ ఆచార్యులుగా విధులు నిర్వహిస్తున్న డా.పి.విజయకుమార్ మాట్లాడుతూ తెలుగు భాష ప్రాచీన భాష అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు మాతృభాషను మరువకుండా గుర్తించుకోవాలని పిలుపునిచ్చారు.