అనంతపురం

అర్హులైన ఓటర్ల నమోదు, సవరణలు అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, ఫిబ్రవరి 21: జిల్లాలో అర్హులైన ఓటర్ల నమోదుకు, సవరణలకు ఈ నెల 23, 24వ తేదీల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జీ.వీరపాండ్యన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని బూత్ లెవెల్ అధికారులు వద్ద తాజా ఓటర్ల జాబితాను అందుబాటులో వుంచుతామని, ఓటరు కార్డున్న వారు తమ పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయా లేదా అని పరిశీలించుకోచ్చునన్నారు. ఓటరు జాబితాలో పేరు లేని వారు ఫారం 6, తప్పులు వుంటే ఫారం 8ను, డూప్లికేట్ ఓటర్ల, నివాసం లేని వారు, చిరునామా మారిన పేర్లు, మరణించిన వారి పేర్లు తొలగించేందుకు ఫారం 7ను ఇవ్వాలని తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రజలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
జీసీటీఏ నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ
అనంతపురం సిటీ, ఫిబ్రవరి 21: ప్రభుత్వ కళాశాలల అధ్యాపకుల సంఘం(జీసీటీఏ) నూతన సంవత్సర డైరీనీ గురువారం స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజిలో ఆవిష్కరించారు. ఈ డైరీనీ ఆర్ట్స్ కాలేజి ప్రిన్సిపాల్ డా.ఎన్.రంగస్వామి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యాపకుల సమస్యలను పరిష్కరించడంలో జీసీటీఏ కృషి అభినందనీయమన్నారు.
రేపటి నుండి రాష్టస్థ్రాయి స్పోర్ట్స్ మీట్
అనంతపురం, ఫిబ్రవరి 21: విద్యా భారతి అఖిల భారత సంస్థాన్ అనుబంధ శ్రీ సరస్వతీ విద్యామందిర్ పాఠశాలల విద్యార్థులకు రాష్ట్ర స్థాయి ఖేల్‌కూద్ (స్పోర్ట్స్‌బీట్) ఆటల పోటీలు 23, 24వ తేదీల్లో నిర్వహించనున్నట్లు విద్యామందిర్ జిల్లా ఈవో నరసింహులు తెలిపారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నగర సమీపంలో రాచానపల్లి దగ్గల గల సెయింట్ జోసెఫ్ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఆటలు, క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 250 పాఠశాలల నుండి 800 మంది విద్యార్థినీ, విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. 23న జరిగే ప్రారంభ కార్యక్రమానికి ఎస్పీ జీవీజీ.అశోక్‌కుమార్, ఆర్‌జేడీ ప్రతాప్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు తెలిపారు. 24 ముగింపు కార్యక్రమానికి మంత్రి కాలవ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరవుతారని, 23న సాయంత్రం జరిగే కార్యక్రమానికి మేయర్ మదమంచి స్వరూప, జేఎన్‌టీయూ వీసీ శ్రీనివాస్ కుమార్, ఇతర ప్రముఖలు, అధికారులు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలిజలకు ప్రాతినిథ్యం కల్పించాలి
అనంతపురం, ఫిబ్రవరి 21: రాష్ట్రంలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు జరుగనున్న ఎన్నికల్లో ఒక స్థానం బలిజలకు కేటాయించి, జిల్లా నుండి బలిజలకు ప్రాతినిథ్యం కల్పించాలని బలిజ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో బలిజ సంఘం జిల్లా అధ్యక్షులు బళ్లారి వెంకటరాముడు మాట్లాడారు. జిల్లాలో బలిజలు అధిక సంఖ్యలో ఉన్నారని, జనాభాకనుగుణంగా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని, త్వరలో జరిగే శాసన సభ ఎన్నికల్లో 3 అసెంబ్లీ స్థానాలను బలిజలకు కేటాయించాలని ప్రధాన రాజకీయ పార్టీలను ఆయన డిమాండ్ చేశారు. లేనపక్షంలో బలిజల సత్తా ఏమిటో నిరూపిస్తామన్నారు. స్వతంత్రంగా పోటీ చేయడానికి కూడా వెనుకాడమన్నారు.