అనంతపురం

పారదర్శకంగా గ్రామాలను అభివృద్ధి చేశాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాప్తాడు, ఫిబ్రవరి 21: నియోజకవర్గంలోని గ్రామాలన్నింటిని పారదర్శకంగా అభివృద్ధి చేశామని, ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతామని మంత్రి పరిటాల సునీత తెలిపారు. గురువారం నియోజకవర్గంలోని రూరల్ మండలం కందుకూరు గ్రామ పంచాయతీలో రూ.23 కోట్ల అభివృద్ది పనులను మంత్రి ప్రారంభించారు. ముందుగా మంత్రి పరిటాల సునీతకు తెదేపా నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కందుకూరు గ్రామంలో ఉండే రూ.15 కోట్లతో రెండు వరుసల తారు రోడ్డుకు అనంతపురము నుంచి ధర్మవరం వరకు నిర్మించే తారురోడ్డుకు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని, ముఖ్యంగా ప్రజలకు గ్రామాల్లో వౌలిక వసతులు కల్పించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేశారన్నారు. హంద్రీనీవా నీటి ద్వారా జిల్లాలోని అన్ని చెరువులకు నీరందించామని ప్రజలు అనారోగ్యంతో ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించుకుంటే వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థికంగా చెక్కులను పంపిణీ చేసి ఆదుకున్నామన్నారు. పింఛన్లను రెట్టింపు చేసి వృద్దులకు, వితంతువులకు, వికలాంగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసానిచ్చారన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సక్రమంగా వినియోగించుకొని ఆర్థికంగా అభివృద్ది చెందాలన్నారు. రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని, మొదటి విడతలో రైతుల ఖాతాకు రూ.1000 జమ చేయడం జరిగిందని, మార్చి నెలలోపు రూ.15000 నగదును పూర్తిగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని తెలిపారు. అదేవిధంగా కందుకూరు పంచాయతీలోని కృష్ణంరెడ్డిపల్లి గ్రామంలో రూ.36 లక్షలతో నిర్మించిన సీసీరోడ్లను ప్రారంభించారు.

అహుడా పరిధిలో ఎన్టీఆర్ పార్కు అభివృద్ధి
* కలెక్టర్ వీరపాండ్యన్
అనంతపురం, ఫిబ్రవరి 21: ఎన్టీఆర్ పార్కును అహుడా పరిధిలో పూర్తి స్థాయి అభివృద్ది చేస్తామని కలెక్టర్ వీరపాండ్యన్ పేర్కొన్నారు. పాతవూరు చెరువుకట్ట పక్కన ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పార్కును కలెక్టర్ వీరపాండ్యన్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరానికి ఒకవైపు శిల్పారామం, మరోవైపు ఎన్టీఆర్ పార్క్ తలమానికంగా నిలుస్తున్నాయన్నారు. ఎన్టీఆర్ పార్కును అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ద్వారా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు ఆహ్లాదం, ఆరోగ్యం అందించేందుకు ఎమ్మెల్యే పార్క్‌ను ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. మాంఛో ఫెర్రర్ మాట్లాడుతూ ప్రాంతం ముళ్ల చెట్లు, చెత్త చెదారంతో నిండి ఉన్న చెరువుకట్ట ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దారని, ఎన్టీఆర్ పార్క్ అభివృద్ధికి ఆర్డీటీ ద్వారా తమవంతు సహకారాన్ని అందిస్తామన్నారు. ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి మాట్లాడుతూ నిధులు లేకున్నా దాతల సహకారంతో పార్క్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రజలు స్వచ్చందంగా శ్రమదానంలో పాల్గొన్నారన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, మాంఛో ఫెర్రర్, ఎమ్మెల్యేలను ఘనంగా సత్కరించారు.

నాన్నను గెలిపిస్తేనే దుర్గం అభివృద్ధి
* పీసీసీ అధ్యక్షుడు రఘవీరా కుమార్తె అమృతవీర్
కళ్యాణదుర్గం, ఫిబ్రవరి 21 : ‘నాన్న రఘువీరారెడ్డిని గెలిపిస్తేనే కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం’ అని ఆయన కుమార్తె అమృతవీర్ అన్నారు. గురువారం స్థానిక కాంగ్రెస్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేడు మండలంలోని శిబాయి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో నాన్న గెలుపునకు ప్రజలతోపాటు నాయకులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నాన్న ఎమ్మెల్యేగా గెలిస్తే కళ్యాణదుర్గం నుంచి అనంతపురానికి రైలు మార్గం, తిమ్మసముద్రం వద్ద పారిశామ్రికవాడ, నియోజకవర్గంలోని అన్ని చెరువులకు నీరు, తుముకూరు వరకు రైల్వేరైన్ పూర్తితోపాటు నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.