అనంతపురం

విద్యార్థులు లక్ష్య సాధనకై శ్రమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, ఫిబ్రవరి 27: విద్యార్థులు తమ లక్ష్య సాధనకై శ్రమించాలని, అందుకు ఇదే సరియైన సమయం అని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం జేఎన్‌టీయూలోని ఎన్‌టీఆర్ ఆడిటోరియంలో జేఎన్‌టీయూ 10వ స్నాతకోత్సవంలో మంత్రి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీల్లో విద్యనభ్యసించి పట్టాలను పొందే కాన్వకేషన్ రోజు ప్రతి ఒక్కరు మధురమైన రోజుగా నిలుస్తుందన్నారు. విద్యార్థులు కష్టానికి గుర్తింపును పొందిన రోజుగా పేర్కొన్నారు. పట్టా పొందిన రోజున భవిష్యత్తు లక్ష్యాలను సాధించుకోవడానికి తొలి అడుగు ఇక్కడ నుండి మొదలవుతుందన్నారు. లక్ష్యాలను ఎంచుకోవడమే కాకుండా వాటిని సాధించేందుకు మరింత శ్రమించాలన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను వమ్ము చేయకుండా వారు పుట్టిన ఊరికి, జిల్లాకు, యూనివర్సిటీకి, రాష్ట్రానికి, దేశానికి పేరు తెచ్చేలా ఎదగాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చి నిత్య విద్యార్థిగానే ఉంటూ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారన్నారు. ప్రతి ఒక్కరు కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండాలన్నారు. 2014లో రాష్ట్ర విభజన అశాస్ర్తియంగా చేశారని, రాజధాని లేకుండా, ఆదాయాన్నిచ్చే రాజధానిని వదులుకుని దాదాపు 17 వేల కోట్ల బడ్జెట్‌లో రాష్ట్రం ఏర్పడిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కాకుండా వేరెవరైనా కూడా లోటు బడ్జెట్‌తో ఇబ్బందులుపడేవారని పేర్కొన్నారు. కేవలం విద్యతోనే రాష్ట్ర, దేశం, సమాజాన్ని మార్చగలమన్న విశ్వాసంతో విద్యకు పెద్ద పీటను వేస్తున్నామన్నారు. నేడు రాష్ట్రంలో కేజీ నుండి పీజీ వరకు అకడమిక్ క్యాలెండర్ రూపొందించి పరీక్షల నిర్వహణ మొదలుకుని సెలవులు వరకు ఒకే క్రమ పద్ధతిలో అమలుచేస్తున్నామన్నారు. 2014లో 17వ స్థానంలో వున్న విద్యా శాఖను ఈ నాలుగున్నర సంవత్సరంలో 3వ స్థానంలోకి తీసుకువచ్చామని తెలిపారు. అలాగే రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును ఆమోదించి, దేశంలోని అత్యుత్తమ యూనివర్సిటీలను రాష్ట్రంలో నెలకొల్పేలా చేస్తున్నామని తెలిపారు. విద్యతోనే దేశం, రాష్ట్రం, మన ఊరు, యూనివర్సిటీలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు.
విద్యార్థులు సాంకేతిక పద్ధతుల వైపు పయనించాలి
మాజీ ఐఐఐటీ శాస్తవ్రేత్త ఆచార్య బి.యజ్ఞనారాయణ
విద్యార్థులు నూతన విషయాలను తెలుసుకుంటూ సాంకేతిక పద్ధతులతో ముందుకు సాగాలని ఐఐఐటీ మాజీ శాస్తవ్రేత్త ఆచార్య బి.యజ్ఞనారాయణ పేర్కొన్నారు. బుధవారం జేఎన్‌టీయూ 10వ స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ స్నాతకోత్సవంలో ఆచార్య యజ్ఞనారాయణకు గౌరవ డాక్టరేట్‌ను జేఎన్‌టీయూ ప్రధానం చేసింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు ఉద్యోగాలు కల్పించే కార్కానాలు కావని, విద్యార్థులచే వాటిని స్పష్టించే శక్తి ఉందన్నారు. జేఎన్‌టీయూ యూనివర్సిటీకి తనకు చాలా మంచి అనుబంధం ఉందని తెలిపారు. గతంలో అనేక డాక్టరేట్లును పోస్టు ద్వారానే తీసుకున్నానని, జేఎన్‌టీయూ అనంతపురం తనకు డైరెక్టుగా డాక్టరేట్ ఇవ్వడం చాలా సంతోషకరమన్నారు. ప్రస్తుతం సమాజంలో టెక్నాలజీ ప్రముఖ పాత్ర పోషిస్తోందని, వాటిని విద్యార్థులు వినియోగించుకుని నూతన విషయాల వైపు చూడాలన్నారు. నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా విద్యను బోధిస్తున్నారని, అయితే ఉపాధ్యాయులు నేరుగా బోధించే పద్ధతికి ప్రాముఖ్యత తగ్గుతూ వస్తోందన్నారు. ప్రతి ఒక్కరు సమాజంలో ఏదో ఒక విధంగా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. జీవితంలో తాను చూసిన వ్యక్తుల్లో ప్రత్యేకించి విద్యా శాఖలో చెడ్డవారిని చూడలేదని, ప్రతి ఒక్కరు అవకాశం కల్పిస్తే తమ సామర్థ్యాన్ని నిరూపించుకోగలరన్నారు. మన ఆలోచనలపై కూడా మీడియా ప్రభావాన్ని చూపుతోందన్నారు. ఆ ప్రభావం నుండి బయటపడాలన్నారు.