అనంతపురం

ఘనంగా జేఎన్‌టీయూ 10వ స్నాతకోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, ఫిబ్రవరి 27: జవహర్‌లాల్ నెహ్రు టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం అనంతపురం 10వ స్నాతకోత్సవం బుధవారం జేఎన్‌టీయూలోని ఎన్‌టీఆర్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ఐఐఐటీ మాజీ శాస్తవ్రేత్త ఆచార్య బి.యజ్ఞనారాయణ, గౌరవ అతిథిగా రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆచార్య యజ్ఞనారాయణకు 10వ గౌరవ డాక్టరేట్‌ను జేఎన్‌టీయూ ఉప కులపతి ఆచార్య శ్రీనివాసకుమార్ ప్రధానం చేశారు. ఉదయం 10 గంటలకు ఈ స్నాతకోత్సవాన్ని ప్రారంభించారు. ఈ స్నాతకోత్సవంలో విశ్వవిద్యాలయ పరిధిలోని బి.టెక్, ఎంటెక్, ఫార్మసీ, ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు 35 మంది గోల్డ్ మెడల్స్‌ను, 22,145 డిగ్రీ పట్టాలను అందజేశారు. ఇందులో డాక్టరేట్ ఆఫ్ ఫిలాసఫీలో 133, ఫార్మసీ 154లలో డాక్టరేట్‌లు, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంఎస్సీ, మేనేజ్‌మెంట్‌లలో ఫ్రీ కాన్వకేషన్‌లో 3007, ఇన్ కాన్వకేషన్‌లో 9,561, పోస్టు కాన్వకేషన్‌లో 9,575 మంది కలసి 22,143 మందికి డిగ్రీ పట్టాలను అందజేశారు. అనంతరం 10వ స్నాతకోత్సవ గౌరవ డాక్టరేట్‌ను ఐఐఐటీ మాజీ శాస్తవ్రేత్త ఆచార్యులు బీ.యజ్ఞనారాయణకు జేఎన్‌టీయూ వీసీ, మంత్రి, రెక్టార్ ఆచార్య ప్రహ్లాదరావు, రిజిస్ట్రార్ ఆచార్య కృష్ణయ్యలు అందజేశారు. అనంతరం 29 మంది గోల్డ్‌మెడల్స్‌ను, ఇందులో ఈసీ డిపార్టమెంట్‌లో విజి రెడ్డి రాజశ్రీకి 6 గోల్డ్ మెడల్స్‌ను, సీఎస్‌ఈలో యాదుల హర్షితకు, కెమికల్ ఇంజనీరింగ్‌లో గుండాల సుదీప్తికి, ఈసీఈలో కునుతురు విష్ణుప్రియలకు ఒక్కొక్కరికి రెండు గోల్డ్ మెడల్స్ అందుకున్నారు. అలాగే యూనివర్సిటీ పరిధిలోని యూజీ, పీజీ, పీహెచ్‌డి కలపి 22,143 డిగ్రీ పట్టాలను అందజేసారు. అనంతరం జేఎన్‌టీయూ వీసీ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాన్ని అందరి సహకారంతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గత సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధిని, ప్రొఫెసర్స్ పోస్టులను భర్తి చేశామని, నూతన కోర్సులను, పొందిన అవార్డులను, మెడల్స్‌ను తెలియజేశారు.

లక్ష్యాన్ని ఎంచుకుని చదవాలి
* విద్యాభివృద్ధికి బడ్జెట్‌లో పెద్దపీట * మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు
ఉరవకొండ, ఫిబ్రవరి 27 : విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని చదివితే ఉన్నత శిఖరాలు చేసుకుంటారని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని అమిద్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హైబ్రీడ్ మ్యానిటీ మోడ్ ప్రాజెక్ట్ పథకాన్ని ప్రారంభించారు. ముందుగా ప్రాజెక్టు పైలాన్‌ను ఆవిష్కరించడంతోపాటు పాఠశాలలో వౌలిక సదుపాయాలు పథకాల పనులకు శంఖుస్థాపన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ.282.34 కోట్లతో పాఠశాలలో వౌలిక సదుపాయాలతోపాటు కస్తూరిబా పాఠశాలలో వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. విభజన అనంతరం రాష్ట్రం రూ.18 వేల కోట్లు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యాభివృద్ధికి బడ్జెట్‌లో పెద్దపీట వేస్తూ రూ.15 వేల కోట్లు కేటాయించారన్నారు. పాఠశాలల్లో వౌలిక సదుపాయాలతోపాటు పనులు చేపట్టేందుకు రూ.4850కోట్లు మంజూరు చేస్తే జిల్లాకు మాత్రమే రూ.282 కోట్లు కేటాయించామన్నారు. ఫలితంగా గ్రామాల్లో పాఠశాలలు రూపురేఖలు మారాయన్నారు. కార్పొరేట్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంతోపాటు డిజిటల్ విద్యాబోధన చేస్తున్నట్లు వివరించారు. దీంతో 1.71 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలు వదిలి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారన్నారు. పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి ర్యాంకులు సాధించి నియోజకవర్గాన్ని ప్రత్యేక స్థానంలో నిలపాలన్నారు.