అనంతపురం

ముత్తువకుంటలో సోలార్ హైబ్రీడ్ పవర్ ప్రాజెక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మార్చి 5 : జిల్లాలోని కనగానపల్లి మండలం ముత్తువకుంట గ్రామంలో సోలార్ హైబ్రీడ్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మంగళవారం రాజధాని అమరావతిలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈమేరకు 10 మెగావాట్ల విద్యుత్ నిల్వ సామర్థ్యంతో 75.25 ఎకరాల భూమిని ప్రాజెక్టు నిర్మాణానికి కేటాయించారు. మార్కెట్ ధర ప్రకారం ఎకరాకు రూ.3,45,378 చెల్లించాలన్న షరతుతో ఆమోద ముద్ర వేశారు. అలాగే తాడిపత్రి మండలం ఊరిచింతల గ్రామంలో పవన్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఊరిచింతలలో 50.95 సెంట్లు, వెలమకూరులో 2.99 సెంట్లు మార్కెట్ రేటు ప్రకారం చెల్లించాలని సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థలకు కేటాయించారు. అలాగే వేసవిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు తక్షణం కార్యచరణ ప్రణాళికలు రూపొందించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇక ఫిబ్రవరి 11న ఢిల్లీలో జరిగిన ధర్మ పోరాట దీక్షలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు ఈనెల 9 నుంచి 13 వరకు ఐదు రోజులు ఆన్‌డ్యూటీగా పరిగణిస్తూ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అలాగే జనవరి 30న ప్రత్యేక హోదా, విభజన హామీలపై తీసుకున్న చర్యలకూ ఆమోదం తెలిపింది. బెరైటీస్ గనుల నుంచి ముడి పదార్థాల ప్రాసెసింగ్, రసాయనిక యూనిట్లు ఒప్పందం మేరకు నిర్దేశించిన పరిమాణంలో 50 శాతం లక్ష్యాన్ని సాధించకుంటే 5 శాతం అపరాధ రుసుం విధించడానికి ఆమోదం తెలిపింది. అలాగే ధర్మవరంలో జామియా ముస్లిం వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కమిటీకి 20.26 ఎకరాల భూమి కేటాయింపు. మార్కెట్ ధర ప్రకారం ఎకరాలకు రూ.లక్ష చెల్లించే షరతుతో స్థలం కేటాయించారు.