అనంతపురం

టిక్కెట్లు ఎవరికి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మార్చి 5: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి అభ్యర్థుల్ని ఖరారు చేసే ప్రక్రియలో భాగంగా బుధవారం జిల్లాకు సంబంధించి ఎంపికలపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించనున్నారు. ఈ సందర్భంగా హిందూపురం మినహా 13 అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అనుచరులు, ఆశావహులు, అసమ్మతి వర్గీయులు మంగళవారం మధ్యాహ్నం నుంచి ప్రత్యేక వాహనాలు, బస్సులు, రైళ్లలో అమరావతికి వెళ్లారు. అక్కడ నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులతో సీఎం భేటీ కానున్నారు. వారి నుంచి అభిప్రాయాలు సేకరించడంతో పాటు ఇదివరకే సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుకు వచ్చిన ర్యాంకులు, ఇటీవల ప్రత్యేకంగా చేయించిన సర్వేలు, వ్యతిరేక వర్గాలు, అసమ్మతి నేతల నుంచి అందిన ప్రతికూల అంశాలను బేరీజు వేసి అభ్యర్థుల పేర్లను అధినేత ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్‌లతో పాటు కొన్ని నియోజకవర్గాల్లో కొత్త ముఖాలు కూడా తెరపైకి వస్తాయా? అన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అనంతపురం ఎంపీ స్థానానికి జేసీ.దివాకర్‌రెడ్డి తనయుడు జేసీ.పవన్‌రెడ్డి పేర్లు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి ఎంపికలో ప్రతిష్టంభన నెలకొంది. ఎంపీ నిమ్మల కిష్టప్ప ఈసారి సుముఖంగా లేకపోవడంతో పాటు పెనుకొండ ఎమ్మెల్యే పార్థసారథి కూడా అయిష్టంగానే ఉండగా, హిందూపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ తిప్పేస్వామి ఎంపీ సీటు ఆశిస్తున్నారు. అయితే అంబికాకు అహుడా చైర్మన్ పదవి దాదాపు ఖరారైంది. నేడు ఆయన పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక తిప్పేస్వామి పేరు ప్రకటిస్తారా? లేదా అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే రాయలసీమలోని కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు సంబంధించి భేటీలను అధినేత నిర్వహించి పలు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల పేర్లకు ప్రకటించారు. అదే సమయంలో కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి బలమైన నాయకుల్ని తెచ్చి పార్టీకి బలాన్ని చేకూర్చారు. ఇపుడు అనంతపురం వంతు రావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్టీని బలోపేతం చేసి వైకాపాకు ఈసారి ఒక్క సీటు కూడా దక్కకుండా చేయాలన్న లక్ష్యంతో అధినేత ఉండటం, గెలుపు గుర్రాలను అనే్వషిస్తుండటంతో కొత్త ముఖాలు వస్తాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో గత కొన్ని రోజుల నుంచి అసమ్మతి వర్గం సిట్టింగ్‌లకు టికెట్లు ఇవ్వరాదంటూ తమ గళాన్ని పెంచింది. దీంతో తొలి జాబితాలో టికెట్లు ఎవరికి దక్కుతాయో, ఎవరి గల్లంతవుతాయోనన్న ఆందోళన కొందరు సిట్టింగ్‌లతో నెలకొంది. ఈ పరిస్థితుల్లో పార్టీ శ్రేణులు కూడా గందరగోళంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు కార్యకర్తలు, అటు ప్రజల్లోనూ టీడీపీ అధినేత ఎలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సగం వరకూ సిట్టింగ్‌లకే అవకాశాలు ఉన్నాయని, మిగతా ఏడింటిలో కొన్నింటిలోనైనా కొత్త వారికి అవకాశాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఇదే సమయంలో సామాజిక వర్గాల సమీకరణలను బట్టి వేరే పార్టీ నుంచి కూడా టీడీపీలోకి తెచ్చే వ్యూహమేదైనా ‘బాబు’ వద్ద ఉందా? అన్న దానిపైనా చర్చసాగుతోంది. ఇప్పటికే రాయదుర్గంలో వైకాపాకు చెందిన మాజీ ఎమ్మెల్యే పాటిల్ వేణుగోపాల్‌రెడ్డి కుటుంబాన్ని వ్యూహాత్మకంగా టీడీపీలోకి తీసుకోవడం తెలిసిందే. మరోవైపు వైకాపా నుంచి కూడా చేరికలు ఉంటున్నాయి. కాగా అనంతపురం, కల్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లో అసమ్మతి జ్వాలలు రగిలాయి. తమ అనుకూల నాయకులు, వర్గీయులు, కుల సంఘాలతో సమావేశాలు నిర్వహించి టికెట్ల తమ సామాజిక వర్గానికే ఇవ్వాలని కొందరు, సిట్టింగ్‌లకు తప్ప ఎవరికిచ్చినా మద్దతిస్తామని, లేకుంటే ఎన్నికల్లో సహకరించేది లేదంటూ తెగేసి చెప్పడం తెలిసిందే. కదిరిలో తొలి నుంచి కందికుంట వెంకటప్రసాద్, వైకాపా నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న స్థానిక ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషాకు మధ్య టికెట్ విషయంలో పోటీ నెలకొంది. శింగనమలలో విప్ యామినీ బాలపైనా తీవ్ర వ్యతిరేకత సొంత పార్టీలో రగిలింది. పుట్టపర్తిలో పల్లెకు వ్యతిరేకంగా అసమ్మతి రోడ్డెక్కింది. మడకశిరలో మాజీ ఎమ్మెల్యే ఈరన్నకు కాకుండా ఎస్సీ సామాజిక వర్గంలో ఎవరికైనా ఇవ్వాలని సుమారు 10 మంది దాకా ఆశావహులు డిమాండ్ చేస్తున్నారు. గుంతకల్లులో ఆశావహులు మాజీ జెడ్పీటీసీ కేసీ.నారాయణ, గుత్తికి చెందిన వెంకటశివుడు యాదవ్, పత్తి హిమబిందు తదితరులు టికెట్ ఆశిస్తున్నారు. దీంతో ఈసారి టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యే కావాలని, అలాగే మంత్రి వర్గంలో బెర్త్ సంపాదించుకోవాలని ఆశిస్తున్న సిట్టింగ్‌లు అధినేత ప్రకటనపై ఆందోళనలో ఉన్నారు.