అనంతపురం

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం టౌన్, మే 10 : హిందూపురం తదితర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసి 41 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పెనుకొండ డిఎస్పీ సుబ్బారావు తెలిపారు. మంగళవారం స్థానిక వన్‌టౌన్ పోలీసుస్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిందూపురానికి చెందిన షేక్ అల్లాబకాష్, నూర్ మహమ్మద్, కర్నాటక గుట్టు కొడిగెనహళ్లికి చెందిన ముజీబ్, మాల్యాకు చెందిన అక్బర్ ముఠాగా ఏర్పడి ద్విచక్ర వాహనాలను దొంగలించి ఇతర ప్రాంతాల్లో విక్రయాలు చేసి సొమ్ము చేసుకున్నారు. ఈ నేపథ్యంలో హిందూపురంలో కూడా పలు ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయి. వీటికి సంబంధించి ఎనిమిది కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈనేపథ్యంలో వన్‌టౌన్ ఇదుర్‌బాషా నేతృత్వంలో ఎస్సైలు వెంకటేశ్వర్లు, దిలీప్‌కుమార్, మహబూబ్‌బాషా సిబ్బంది ద్విచక్ర వాహనాల చోరీలపై ప్రత్యేక నిఘా ఉంచి కర్నాటక ప్రాంతంలో ద్విచక్ర వాహనాలను విక్రయిస్తున్న సంబంధిత నిందితులపై దృష్టి సారించగా మంగళవారం పట్టణంలోని పెనుకొండ రోడ్డులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా వివిధ ప్రాంతాల్లో దొంగలించిన 41 ద్విచక్ర వాహనాల సమాచారాన్ని తెలియజేసినట్లు తెలిపారు. దీంతో ఆయా వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇందు లో 37 టివిఎస్ మోపెడ్లు, మూడు హీరోహోండా స్ప్లెండర్ ఫ్లస్, ఓ స్టార్ సిటీ ద్విచక్ర వాహనాలు ఉండగా వాటి విలువ దాదాపు రూ.8.50 లక్షలు ఉంటుందని చెప్పారు. నిందితులను అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిఐ, ఎస్సై, కానిస్టేబుళ్లను డిఎస్పీ అభినందించారు.