అనంతపురం

‘హోదా’ కోసం కాంగ్రెస్ కొవ్వొత్తుల ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురంటౌన్, మే 12: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ రాజ్యసభలో ప్రవేశపెడుతున్న ప్రైవేట్ బిల్లుకు టిడిపి, బిజెపిలు మద్దతు ఇవ్వాలని కోరుతూ గురువారం కాంగ్రెస్ నగర కమిటీ ఆధ్వర్యంలో నగర ప్రధాన వీధులలో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ భవన్ నుంచి కొవ్వొత్తులు చేతపట్టి ఎపికి ప్రత్యేక హోదా కల్పించాలని, బిల్లుకు టిడిపి, బిజెపిలు మద్దతు ఇవ్వాలని కోరుతూ నినాదాలు చేశారు. కొవ్వొత్తుల ర్యాలీ కాంగ్రెస్ భవన్ నుంచి సప్తగిరి సర్కిల్, సుభాష్ రోడ్డు మీదుగా టవర్‌క్లాక్ చేరుకుంది. ర్యాలీలో పిసిసి ఉపాధ్యక్షుడు శైలజానాథ్, నగర కమిటీ అధ్యక్షుడు దాదాగాంధి తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా పిసిసి ఉపాధ్యక్షుడు శైలజానాథ్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టిందన్నారు. ఈ బిల్లు న్యాయమైనది కావటంతో సిపిఐ, సిపిఎం, సమాజ్‌వాది, జెడియు, ఎన్‌సిపి తదితర పార్టీలు మద్దతు ప్రకటించాయన్నారు. విభజన చట్టంలో ఎపికి ప్రత్యేక హోదా కల్పించటంతోపాటు వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని పొందుపరచిందన్నారు. హోదా ఐదేండ్లు కాదు పదేండ్లపాటు కొనసాగించాలని పార్లమెంటులో విపక్ష బిజెపి నేత వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకయ్యనాయుడు మూగనోము పట్టారని అన్నారు. హోదా సాధ్యం కాదని చెప్పటం ద్వారా బిజెపి ప్రభుత్వం ఎ.పి ప్రజలను మోసం చేసిందన్నారు. అలాగే చంద్రబాబునాయుడు సైతం హోదాపై కేంద్రంపై వత్తిడి తీసుకురావటంలో విఫలమైనారని అన్నారు. హోదాకన్నా ప్యాకేజీలు మేలంటూ సన్నాయినొక్కులు నొక్కుతున్నారని అన్నారు. విభజన చట్టంలో రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వాలని, లోటు బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వమే భరించాలని స్పష్టంగా పేర్కొనటం జరిగిందన్నారు. ఈ హామీలను అమలుచేయటంలో బిజెపి దాటవేత ధోరణి అవలంబిస్తోందన్నారు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తూ స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టారన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలిచి ప్రత్యేక హోదా, ప్యాకేజీలను రాష్ట్రానికి మంజూరు చేయాలని బిజెపి ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు రాజ్యసభలో ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టిందన్నారు. బిల్లును నీరుకార్చాలని బిజెపి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు. లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేయటం ద్వారా బిజెపి కపట బుద్ధిని ప్రదర్శించిందన్నారు. అయితే శుక్రవారం రాజ్యసభలో చర్చకు వస్తున్న ప్రైవేట్ బిల్లుకు టిడిపి, బిజెపిలు మద్దతు ఇచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఆయన హితవుపలికారు.
జల సాధన యాత్రను అడ్డుకోవద్దు
* వైకాపా నేత తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
చెనే్నకొత్తపల్లి, మే 12: హంద్రీనీవా ద్వారా జిల్లాకు నీరివ్వాలని చేపట్టిన జల సాధన సమితి యాత్రను తెదేపా నాయకులు అడ్డుకోవాలని చూస్తున్నారని రాప్తాడు నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. చెనే్నకొత్తపల్లిలోని ఎస్‌సి కా లనీలో జల సాధన సమితి యాత్ర గు రువారం కొనసాగింది. ఈ సందర్భ ంగా ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ రాప్తా డు నియోజకవర్గం మీదుగా కుప్పం వెళ్తున్న హంద్రీనీవా నీటిని రూ.420 కోట్లు వెచ్చించి హంద్రీనీవా నీటిని పిల్ల కాలువల ద్వారా తరలించే కుట్ర జరుగుతోందని ఆయన విమర్శించారు. అంతేకాకుండా కరవుతో జిల్లా ప్రజలు అల్లాడుతుంటే విదేశీ యాత్రలు, సొంత వ్యాపారాలపైనే చంద్రబాబుకు మక్కువ వుందని ఆయన ఎద్దేవ చేశారు. అబద్ధాల పుట్ట చంద్రబాబు అని, ఆయన స్వలాభం కోసమే ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని కూడా తాకట్టు పెట్టారని ఆయన విమర్శించారు. అమలుకాని హామీలిచ్చి చంద్రబాబు గద్దెనెక్కడం జరిగిందని, రానున్న ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. స్థానిక మంత్రి పరిటాల సునీత ఈ హంద్రీనీవా నీటిపై జరుగుతున్న కుట్రను ప్రోత్సహిస్తోందని ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. జల సాధన యాత్ర కేవలం రైతు యాత్రగానే టిడిపి నాయకులు చూడాలన్నారు. రాజకీయాలకు అతీతంగా, శాంతియుతంగా చేస్తున్న ఈ యాత్రకు టిడిపి నాయకులు అడ్డుపడకుండా అభివృద్ధి వైపు మొగ్గు చూపాలని ఆయన తెదేపా నాయకులకు, ప్రజాప్రతినిధులకు హితవు పలికారు. రాప్తాడు నియోజకవర్గంలో జూన్ 1వ తేదీన వైసిపి అధినేత పర్యటించడం జరుగుతుందని తోపుదుర్తి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సికెపల్లి మండల కన్వీనర్ మైలారపు గోవిందరెడ్డి, రాప్తాడు కన్వీనర్ రామాంజనేయులు, రాప్తాడు సింగిల్‌విండో ప్రెసిడెంట్ కేశవరెడ్డి, గాలి శ్రీనివాసరెడ్డి, జయరామిరెడ్డి, సర్పంచులు దాసునాయక్, ఆది, నరేంద్రరెడ్డి, నరసింహులు, ఎంపిటిసి లక్ష్మినారాయణ, నరసింహులు, జయరామిరెడ్డి, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.