అనంతపురం

త్వరగా డిగ్రీ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం టౌన్, మే 13 : వీలైనంత త్వరగా డిగ్రీ ఫలితాలు వెల్లడించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్‌కెయూ యుజి డీన్ జీవన్‌కుమార్, డిప్యూటీ రిజిస్ట్రర్ శ్రీరాములునాయక్ తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఎన్‌ఎస్‌పిఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో చదువుతున్న డిగ్రీ మూల్యాంకనాన్ని పరిశీలించారు. మూల్యాంకనం కోసం ఏర్పాటు చేసిన సదుపాయాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులకు వీలైనంత త్వరగా ఫలితాలను వెల్లడించాలన్న ఉద్దేశంతో జిల్లాలోని అనంతపురం, హిందూపురంలో డిగ్రీ మూల్యాంకనంకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈనెల 5వ తేదీ నుండి ప్రారంభమైన మూల్యాంకనం ఈనెలాఖరుకు పూర్తవుతుందన్నారు. జూన్ మొదటి లేదా రెండో వారంలో పూర్తి స్థాయి ఫలితాలు విడుదలకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. హిందూపురం కేంద్రంలో 16 వేల మంది విద్యార్థులకు సంబంధించి మూల్యాంకనం జరుగుతోందన్నారు. శనివారం నుండి రసాయనశాస్త్రం, జంతు, వృక్ష శాస్త్రాలకు సంబంధించి మూల్యాంకనం ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శంకరయ్య, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు శ్రీనివాసులునాయుడు, రామసుబ్బయ్య, నరసింహులు, భోజప్ప తదితరులు ఉన్నారు.