అనంతపురం

500 క్వింటాళ్ల విత్తనకాయలు సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాండ్లపెంట, మే13, మండలకేంద్రంలోని ఓ ప్రైవేట్ గోడౌన్‌లో 500క్వింటాళ్ల విత్తనవేరుశనగ కాయలను శుక్రవారం విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. విజిలెన్స్ సిఐ వెంకటేశ్వర్లు వ్యవసాయ అధికారి ఉమాపతి తెలిపిన వివరాలమేరకు మండలంలోని ఓప్రైవేట్ వేరుశనగ గోడౌన్‌లో తనిఖీలు నిర్వహించగా అందులో సుమారు 500క్వింటాళ్ల వేరుశనగ విత్తనకాయల బస్తాలకు ఎలాంటి పర్మిట్లు లేకపోవడంతో వాటిని సీజ్‌చేసి స్థానిక రెవెన్యూ అధికారులకు అప్పగించారు. అలాగే ఈదాడుల్లో స్థానిక రెవెన్యూ అధికారులు సిఎస్‌డిటి నాగభూషణం గౌడ్, ఆర్‌ఐ నాగభూషణం, విఆర్‌ఓ ఆదినారాయణమ్మ, పాల్గొన్నారు. కాగా గోడౌన్ యజమాని మాట్లాడుతూ మండల పరిధిలోని కొందరు రైతులు విత్తన కాయలు ఇందులో నిల్వ ఉంచారన్నారు.

కుక్కల దాడిలో 30 గొర్రె పిల్లలు మృతి
బత్తలపల్లి, మే 13:గొర్రెల కాపరులు గొర్రెల పిల్లలను గూడులలో వుంచి మేపునకు వెళ్ళగా గూడులలో వున్న పిల్లలను కుక్కలు దాడి చేయడంతో 30గొర్రె పిల్లలు మృతిచెందాయి. దీంతో రూ.1.50లక్షలు నష్టం వాటిల్లినట్లు బాధిత గొర్రెల కాపరులు వాపోయారు. బత్తలపల్లికి చెందిన నాగరాజు, నారాయణస్వామి, కమ్మన్న, ఆదెప్ప, సుబ్బన్న, గొర్రెల కాపరులు గురువారం గొర్రెలను పొలాల్లోకి మేపునకు తీసుకెళ్ళగా వాటి పిల్లలు సుమారు 30 గొర్రెల మందలలో ఏర్పాటు చేసుకున్న గూడులలో వుంచి వెళ్ళారు. అక్కడ కాపలగా ఎవరూ లేకపోవంతో కుక్కలు పిల్లలన్నింటిని చంపేశాయి. గురువారం రాత్రి గొర్రెల మందకు వచ్చిన కాపరులకు పిల్లలు మృతిచెందిన విషయం తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై శుక్రవారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో గొర్రెల పిల్లల మృతిపై తహశీల్దార్ సురేష్‌బాబుకు వినతిపత్రం అందజేశారు. కుక్కల దాడిలో సుమారు రూ.1.50లక్షల దాకా నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.