అనంతపురం

కార్పొరేట్ గుప్పిట్లో ప్రభుత్వాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, నవంబర్ 28 : కార్పొరేట్ కంపెనీల గుప్పెట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు ఆరోపించారు. శనివారం సాయంత్రం స్థానిక గణేనాయక్ భవన్‌లో నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందేందుకు ప్రధాని మోదీ అనేక ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే ప్రజలపై ఎనలేని భారం పడుతుందన్నారు. బిహార్ ఎన్నికల్లో పరాజయం పొందినా తన విధానాలను ఏ మాత్రం పరిశీలించుకోకపోవడంతోపాటు మరింత వేగవంతంగా అమలు చేసేందుకు కాంగ్రెస్ సహకారం కోసం యత్నించడం బాధాకరమన్నారు. ఒకవైపు మత అసహనం కొనసాగిస్తూనే మరోవైపు కార్పొరేట్ కంపెనీలకు సేవ చేసేందుకు తపిస్తున్నారన్నారు. విదేశీ పర్యటనల్లో కంపెనీలకు రాయితీల హామీలు గుప్పిస్తున్న పాలకులకు నిత్యావసర సరుకుల ధరలతో పేదలు అల్లాడిపోతున్న విషయం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. లక్షల ఎకరాల భూమిని భూ బ్యాంకు ద్వారా సేకరిస్తూ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. రాయలసీమ జిల్లాల్లో ఏడు లక్షల ఎకరాల భూమిని సేకరించనున్నారని దీనివల్ల ఈ ప్రాంతం మరింత వెనుకబడే ప్రమాదముందన్నారు. ఈ విధానాల వల్ల ప్రభుత్వంపై అసంతృప్తి పెరిగిపోతోందన్నారు. వారందరినీ సమన్వయపరచి సమస్యలపై ఉద్యమించేలా సిద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైందని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఓ.నల్లప్ప, రాయలసీయ అభివృద్ధి సబ్ కమిటీ కన్వీనర్ జి.ఓబులు, సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్, కార్యదర్శివర్గ సభ్యులు ఎం. ఇంతియాజ్, డి.కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నమ్మకంతోనే మహిళలకు రుణాలు
* ఎమ్మెల్యే జెసి ప్రభాకర్‌రెడ్డి
తాడిపత్రి, నవంబర్ 28: మహిళలపైనున్న నమ్మకంతోనే బ్యాంకులు పొదుపు రుణాలిస్తున్నాయని, బ్యాంకుల నమ్మకాలను వమ్ము చేయకుండా రుణాలు తిరిగి చెల్లించాలని శాసనసభ్యులు జెసి ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక దివాకర్ మునిసిపల్ ఆడిటోరియంలో శనివారం ఆంధ్రాబ్యాంకు ఆధ్వర్యంలో చేపట్టిన మహిళా పొదుపు సంఘాల రుణ పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిధిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసంగిస్తు మీమీద భరోసాతోనే ఆంధ్రాబ్యాంకు రుణాలిస్తుందని, ఆ డబ్బు ఆర్థికాభివృద్ధికి వినియోగించుకొని, తిరిగి బ్యాంకుకు చెల్లించేల ప్రతిసంఘం కృషి చేయాలన్నారు. మహిళలు కుటీర పరీశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు సంజీవనగర్‌లో రూ.30లక్షల వ్యయంతో భారీషెడ్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించేందుకు పాలడెయిరీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మహిళలు తమఇంటిముందు చెట్లను పెంచాలని కోరారు. అనంతరం తాడిపత్రి అర్బన్, రూరల్ పరిధిలోని 80 మహిళా పొదుపు సంఘాలకు రూ.3.10కోట్ల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్‌పర్సన్ వెంకటలక్ష్మి, ఆంధ్రాబ్యాంక్ డిజిఎం గోపాలకృష్ణ, ఛీప్ మెనేజర్ రాయుచ్, ఫీల్డ్ ఆఫిసర్ సందీప్‌రాజు తదితరులు పంపిణీ చేశారు.