అనంతపురం

కరవుపై కాంగ్రెస్ పార్టీ ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రహ్మసముద్రం, మే 19: మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు గురువారం కాంగ్రెస్ మండల కన్వీనర్ కోడిపల్లి బసవరాజు అధ్యక్షతన కరవుపై ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిసిసి ఉపాధ్యక్షులు డాక్టర్ శైలజానాథ్, అనంతపురం పార్లమెంట్ ఇన్‌చార్జ్జి అనీల్‌చౌదరి, అనంతపురం ఇన్‌చార్జి దాదాగాంధీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిసిసి ఉపాధ్యక్షులు డాక్టర్ శైలాజానాథ్ మాట్లాడుతూ జిల్లాలో కరవు కరాళ నృత్యం చేస్తోందని, రైతులు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. ఉపాధి హామీ ఎండమావిగా మారిపోయిందని, కూలి అన్న పొట్ట చేత పట్టుకుని సుదూర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 2013-14లో మంజూరు చేసిన రూ.650 కోట్ల పంట నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. 2014-15కు సంబంధించిన పంట నష్టపరిహారం ఇంకా ఇవ్వాల్సి వుందన్నారు. 2015- 16కు పంటలు బాగా పండాయని నివేదికలు ఇవ్వడం వలన పంట నష్టపరిహారం అరకొరగా రైతులకు అందిందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు అనంత అనే కార్యక్రమాన్ని తెచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. కాంగ్రెస్ తాలూకా అధ్యక్షులు బాలా బాబు, కళ్యాణదుర్గం కన్వీనర్ అశోక్, ఎస్‌సి సెల్ జిల్లా అధ్యక్షులు సురేంద్ర, మండల యూత్ కాంగ్రెస్ మంజునాథ్, మాజీ ఎంపిపి రామచంద్రప్ప, గౌరవ అధ్యక్షులు సిరియప్ప, మం డల ఎస్‌సి సెల్ అధ్యక్షులు గోవింద్, బిసి సెల్ అధ్యక్షులు రాధాకృష్ణ, కిసాన్ సెల్ విభాగం ఎర్రిస్వామి, కాం గ్రెస్ నాయకులు పాల్గొన్నారు.