అనంతపురం

మైనింగ్ మాఫియాపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుత్తి, మే 24 : జిల్లాలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ రూ.కోట్లు కొల్లగొడుతున్న మైనింగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని గనులు, భూగర్భజల శాఖ సహాయ సంచాలకులు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ముఖ్యంగా మైనింగ్ మాఫియా నియంత్రించడంలో ఎస్పీ రాజశేఖర్‌బాబు, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ అనిల్‌బాబు సహకారం మరువలేనిదన్నారు. మంగళవారం తనను కలసిన ఆంధ్రభూమి విలేఖరితో మాట్లాడుతూ రాష్ట్రంలోని మైనింగ్ అక్రమ వ్యాపారం జిల్లోలో ఎక్కువగా సాగుతోందన్నారు. తాను బాధ్యతలు చేపట్టిన ఆరునెలల్లో జిల్లాలోని గోరంట్ల, బుక్యరాయసముద్రం, పెద్దవడుగూరు, కదిరి, పెనుగొండ, తాడిపత్రి, తదితర ప్రాంతాల్లో దాడులు నిర్వహించి రాష్ట్రంలోని ఎక్కడా వసూలు కానంత అపరాద రుసం జిల్లాలో రూ.5.50 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. అలాగే పెద్దవడుగూరు మండలంలోని కొందుపల్లి ప్రాంతంలో అనధికారికంగా నిర్వహిస్తున్న ఐదు పరిశ్రమలను మూసివేసి అందులో సుమారు రూ.15 లక్షల విలువజేసే యంత్రాలను స్వాధీనం చేసుకుని పోలీసుస్టేషన్‌లో భద్రపరిచినట్లు తెలిపారు. రెండు రోజుల కిందట యాడికి మండలం పరిధిలో ఎలాంటి అనుమతి లేకుండా నాపరాళ్లను తరలిస్తున్న మూడు లారీలను సీజ్ చేసి రూ.3 లక్షల అపరాద రుసుం వసూలు చేసినట్లు తెలిపారు. తాడిపత్రి సమీపంలో నిర్వహిస్తున్న ఎస్జేకే కంపెనీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీని చెల్లించకుండా మైనింగ్ వ్యాపారం నిర్వహిస్తుండగా రూ.42 కోట్ల అపరాద రుసుం చెల్లించాలి నోటీసులను జారీ చేశామన్నారు. బుక్కరాయసముద్రం మండలం సిద్దరాంపురం వద్ద అనధికారికంగా నిర్వహిస్తున్న మైనింగ్ కంపెనీపై దాడులను నిర్వహించి యంత్రాలను సీజ్ చేశామన్నారు. అనుమతులు లేకుండా మైనింగ్ నిర్వహిస్తున్న నిర్వాహకులకు రూ.35 లక్షల జరిమానా విధించగా అక్కడిక్కడే రూ.5 లక్షలు చెల్లించారన్నారు. మరో రూ.30 లక్షలు త్వరలోనే చెల్లిస్తామని కంపెనీ నిర్వాహకులు హామీ ఇచ్చినట్లు తెలిపారు. అలాగే గోరంట్ల మండలం వడిగేపల్లి సమీపంలో అనధికారికంగా నిర్వహిస్తున్న నాపరాళ్ల కంపెనీపై దాడులను నిర్వహించి రూ.2.90 కోట్లు జరిమానా విధించినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా వరుసగా దాడులు నిర్వహిస్తుండటంతో గతంలో అనేకసార్లు తమపై దాడులు జరిగాయన్నారు. దీంతో విషయాన్ని ఎస్పీ రాజశేఖర్‌బాబు దృష్టికి తీసుకెళ్లగా జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్లకు తమకు భద్రత కల్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసి సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. అలాగే గనులు, భూగర్భ శాఖ చీఫ్ సెక్రటరీ గిరిజాశంకర్ సైతం తమకు అన్నివేళలా తోడ్పాటు అందిస్తున్నారన్నారు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో సిబ్బంది లేకపోవడం వల్ల ఇంకా అక్కడక్కడా అక్రమ మైనింగ్ వ్యాపారం కొనసాగుతోందన్నారు. మైనింగ్ మాఫియా ముఠా సభ్యులు ఎప్పటికప్పుడు తమ కదలికలను గమనిస్తూ వెంబడిస్తున్నారన్నారు. దీంతో ఓ ప్రాంతంలో దాడి నిర్వహించిన వెంటనే మరో ప్రాంతానికి సమాచారం చేరవేస్తున్నారన్నారు. తమకు అవసరమైన స్థాయిలో కార్యదక్షత కల్గిన అధికారులను ఇస్తే మరిన్ని మెరుగైన ఫలితాలు సాధిస్తామన్నారు. ఇప్పటివరకూ జిల్లాలో తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు రాలేదన్నారు. ప్రత్యేకించి అక్రమ మైనింగ్ వ్యాపారులు ఎవరైనా తమ పేర్లు వాడుకుని బెదిరింపులకు పాల్పడితే కఠినంగా వ్యవహరించాలని ఎంపి జెసి దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే జెసి ప్రభాకర్‌రెడ్డి తమకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారన్నారు. జిల్లా అధికారులు ఇలాంటి సహకారం భవిష్యత్‌లోనూ అందిస్తే రానున్న రోజుల్లో జిల్లా నుంచి ఎక్కువ ఆదాయం సమకూరుస్తామని ధీమా వ్యక్తం చేశారు.