అనంతపురం

ప్రపంచానికి భారత్ అందించిన అమూల్య సంపద యోగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, జూన్ 21: భారతదేశం ప్రపంచానికి ప్రసాదించిన అమూల్య సంపద యోగా అని మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత అన్నారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని వారు పేర్కొన్నారు. నగరంలోని పోలీస్ పరేడ్‌మైదానంలో మంగళవారం నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మంత్రులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ప్ర స్తుత కంప్యూటర్ యుగంలో ప్రతి ఒ క్కరు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, మానసిక ప్రశాంతత కోల్పోతున్నారన్నారు. ప్రాచీన జీవన కళ అయిన యోగా ద్వారా వీటన్నింటినీ అధిగమించవచ్చన్నారు. యోగా ద్వారా శరీరం, మనసు అనుసంధానమై తద్వారా కార్యదీక్ష, దక్షత పెరుగుతుందన్నారు. యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, ప్రతి ఒక్కరికి యోగాభ్యా సం తప్పనిసరని అన్నారు. యోగా ద్వా రా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని, రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్ష అని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి రోజు అరగంట యోగాను తప్పనిసరి చేయాలని కలెక్టర్, ఎస్పీలను కోరారు. జడ్పీ చైర్మన్ చమన్ మాట్లాడుతూ ఆధునికకాలంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక జబ్బుతో బాధపడుతున్నారని యోగాతో జబ్బులు దూరమవుతాయన్నారు. కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ యోగా అంటే కేవలం ఆసనాలే కాదని, ప్రాణాయామం కూడా అందు లో భాగమేనన్నారు. ఇది శరీరానికి, మ నసుకు రెండింటికీ సంబంధించిందన్నారు. ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి మా ట్లాడుతూ యోగా వల్ల అనేక లాభాలున్నాయని, అందుకే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయన్నారు. కార్యక్రమానికి జెసి-2 సయ్యద్ ఖాజామొహిద్దీన్ అధ్యక్షత వహించగా జడ్పీ చైర్మన్ చమన్, ఎస్పీ రాజశేఖర్ బాబు, జెసి-2 సయ్యద్ ఖాజామొహిద్దీన్ ఇతర ప్రభుత్వ అధికారులు, నగర ప్రజలు, వివిధ పాఠశాలల విద్యార్థులు యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. కళ్యాణదుర్గం ఆర్డీఓ రామారావు యోగా శిక్షకులుగా వ్యవహరించారు.