అనంతపురం

అర్హులందరికీ పక్కా ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూన్ 21 : అర్హులందరికీ ఇంటి పట్టాలు అందజేయడంతోపాటు ఎన్‌టిఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి పరిటాల సునీత అన్నారు. మంగళవారం అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లి గ్రామంలో 600 మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం నూతన పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ఇంటి పట్టాలిచ్చిన వారందరికీ పక్కా గృహాలు నిర్మించి ఇస్తామన్నారు. కాలనీకి పరిటాల రవీంద్ర పేరు పెట్టడంతో పాటు ఆర్చ్‌ను నిర్మించి తనతో ప్రారంభింపజేయడం మీ అభిమానానికి నిదర్శనమన్నారు. ఈ స్థలాన్ని ఆక్రమించేందుకు ఎందరు యత్నించినా వారి ఆటలు సాగలేదన్నారు. కాలనీలో ప్రతి ఇంటికీ 3 నుంచి 5 మొక్కలు ఇస్తామని, వాటిని పెంచి పెద్ద చేసి పచ్చదనంతో నింపి జిల్లాలోనే ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. అలాగే గ్యాస్ కనెక్షన్ లేని వారు దరఖాస్తు చేసుకుంటే దీపం పథకం కింద మంజూరు చేయనున్నట్లు తెలిపారు. కుష్ఠు వ్యాధితో బాధపడేవారు, బెడ్‌పైన ఉన్నవారి సౌకర్యం కోసం మీ ఇంటికి-మీ రేషన్ పేరుతో ఇళ్ల వద్దకే వెళ్లి సరుకులు పంపిణీ చేస్తున్నామన్నారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. జడ్పీ చైర్మన్ చమన్ మాట్లాడుతూ కూడు, గూడు, గుడ్డ సమకూర్చేందుకు ప్రభుత్వం అనునిత్యం కృషి చేస్తోందన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అనంతర మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మలోలా, రాప్తాడు నియోజకవర్గ జడ్పీటీసీలు, సర్పచులు పాల్గొన్నారు.

తగ్గిన పాల ధర!
* పాడి రైతుల లబోదిబో..
* నేడు మహాధర్నాకు పిలుపు
హిందూపురం, జూన్ 21 : ‘పుండు మీద కారం చల్లిన’ చందంగా పాడి రైతుల పరిస్థితి మారింది. తెలంగాణ ప్రభుత్వం ఎపి పాలను కొనుగోలు చేయద్దని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా పాల ధరలు భారీగా తగ్గిపోయాయి. దీంతో రైతుల లబోదిబో అంటున్నారు. జిల్లాలో వ్యవసాయ రంగం తర్వాత ఎంతో కొంత రైతు కుటుంబాలకు పాడి పరిశ్రమ ఉపశమనం కలిగిస్తోంది. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో రానురాను పాడి రైతులకు కష్టాలు ఎదురవుతున్నాయి. ఇందులో భాగంగా ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఎపి డెయిరీల నుంచి పాలను తీసుకోవద్దంటూ సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు వౌఖికంగా ఆదేశాలు జారీ చేయడంతో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పదిహేను రోజులకు ఒకసారి చెల్లించే పాల బిల్లులు సైతం రెండు నెలలుగా నిలిపివేయడంతో అటు పాల సేకరణ కేంద్రాల నిర్వాహకులు, ఇటు పాడి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ‘పుండు మీద కారం చల్లిన’ చందంగా ఆకస్మికంగా ఎపి డెయిరీ ఉన్నతాధికారులు పాల ధరలను గణనీయంగా తగ్గించడంతో రైతు కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయి. ఈనెల 16వ తేదీ నుంచే తాజాగా తగ్గించిన ధరలు వర్తిస్తాయని స్థానిక పాలశీతలీకరణ కేంద్రంలో గుట్టుచప్పుడు కాకుండా నోటీసులు అతికించడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. దీంతో తమకు జరుగుతున్న అన్యాయంపై మంగళవారం పాడి రైతులు స్థానిక పాలశీతలీకరణ కేంద్రం చేరుకుని తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లయినా పరిస్థితిని చక్కదిద్దడం పోయి ఏదో ఒక సాకుతో పాడి రైతులకు తీరని అన్యా యం చేస్తున్నారంటూ ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ధనాపురం వెంకట్రామిరెడ్డి తదితరులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు సైతం అన్యాయంపై స్పందించకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణలో మాత్రం పాడి రైతులకు సంబంధించిన బిల్లులను ఆ ప్రభుత్వం చెల్లిస్తుండగా ఎపి డెయిరీ మాత్రం గత రెండు నెలలుగా బిల్లులు పెండింగ్‌లో ఉంచడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పంటల సాగు కోసం వ్యవసాయ పనులు చేసుకునేందుకు డబ్బు అవసరమని, దీనికి తోడు బ్యాంక్ రుణాల రెన్యువల్స్, పాడి పశువుల రుణాల చెల్లింపు, బిడ్డల చదువుల కోసం ప్రస్తుతం ఆర్థిక వనరులు ఎంతో అవసరమన్నారు. ఇవన్నీ పట్టించుకోకుండా ఓ వైపు పాల సేకరణను ఆపివేయడం, మరో వైపు ధరలు తగ్గించడం వంటి లోపభూయిష్టమైన చర్యల వల్ల ఎంతో ఇబ్బందులకు గురవుతున్నామని పలువురు కంటతడి పెట్టారు. గతంలో ఆవు పాల లీటర్ ధర రూ.26 నుంచి రూ.27 దాకా ఉండగా ప్రస్తుతం రూ.15 నుంచి రూ.18, గేదె పాలు గతంలో రూ.45 నుంచి రూ.50 దాకా ధర లభించగా తాజాగా రూ.32కు తగ్గిపోయిందన్నారు. అసలు పాల సేకరణను ఎప్పుడు నిలిపి వేస్తారో, ఎప్పుడు ప్రారంభిస్తారో అన్న అయోమయం ఉందన్నారు. దీని వల్ల ప్రైవేటు డెయిరీలు లబ్ధి పొందుతున్నాయన్నారు. గతంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని మూసివేసిన తరహాలోనే మూడు దశాబ్ధాలకుపైగా పాడి రైతులకు భాసటగా నిలుస్తున్న స్థానిక ఎపి పాల శీతలీకరణ కేంద్రాన్ని మూసివేస్తారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. పాడి పరిశ్రమ పట్ల ప్రభుత్వం చూపుతున్న ఉదాసీన వైఖరికి నిరసనగా బుధవారం అన్ని పార్టీల సహకారంతో మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు రైతు సంఘం నాయకులు ధనాపురం వెంకట్రామిరెడ్డి, సిద్ధారెడ్డి, రవీంద్ర, శ్రీనివాసులు తదితరులు తెలిపారు. ఈ ప్రాంత పాడి రైతుల కష్టనష్టాలను దృష్టిలో వుంచుకొని సర్పంచ్ స్థాయి నుంచి ఎంపి, మంత్రుల దాకా తమ ఉద్యమానికి భాసటగా నిలవాలని, ఇతర రాజకీయ పార్టీలు, సంఘాలు కూడా భాగస్వాములు కావాలని పాడి రైతులు విజ్ఞప్తి చేశారు.
బిడ్డలకు ఇవ్వకుండా పాలు పోశాం..
- రామాంజినమ్మ, చెర్లోపల్లి.
ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండటంతో ఇంట్లో బిడ్డలకు తాగడానికి పాలు ఇవ్వకుండా శీతలీకరణ కేంద్రాలకు పోస్తున్నాం. నాలుగు పశువులను రుణాల ద్వారా కొనుగోలు చేసి పాల ఉత్పత్తి ద్వారా జీవనం సాగిస్తున్నాం. ప్రస్తుతం ధరలు పడిపోవడంతో మేం ఎలా బతకాలి.
అప్పు చేసి పాల బిల్లులు చెల్లించా..
- నరసింహారెడ్డి, పాల సేకరణ కేంద్రం, చల్లాపల్లి.
రెండు నెలల్లోనే నాణ్యత లేదని స్థానిక పాలశీతలీకరణ కేంద్రం అధికారులు 22 క్యాన్‌లను వెనక్కు పంపారు. తద్వారా దాదాపు రూ.25 వేల దాకా అప్పు చేసి రైతులకు చెల్లించా.