అనంతపురం

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం టౌన్, జూన్ 24: ప్రస్తుత సమాజంలో యోగాను అభ్యసించడం వల్ల మానసిక ఉల్లాసంతోపాటు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని యోగా ఉపాధ్యాయులు శివగురుప్రసాద్, శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ డిఇ రమేష్‌కుమార్ అన్నారు. శుక్రవా రం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మా ట్లాడుతూ హిందూపురం ప్రాంత ప్ర జలందరికీ సంపూర్ణ ఆరోగ్యం అంది ంచాలన్న ఉద్దేశంతో ఈనెల 26వ తేదీ నుండి సిద్ధ సమాధి యోగా శిక్షణా త రగతులు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా 26వ తేదీ సాయ ంత్రం 5.30 గంటలకు పట్టణంలోని సువర్ణ్భారతి జూనియర్ కళాశాల ఆవరణలో పరిచయ కార్యక్రమం ఉంటుందన్నారు. అనంతరం 14 రోజుల పాటు ప్రాణాయామం, ఆసనాలు, సూర్య నమస్కారాలు నేర్పించనున్నట్లు తెలిపారు. వీటిని సాధన వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చన్నారు. యోగా అనేది కుల, మత, జాతి, వర్గ భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు అభ్యసనం చేయవచ్చన్నారు. ఇప్పటికే ఎంతోమంది యోగాను సాధన కోసం సుఖమయ జీవితాన్ని అనుభవిస్తున్నారన్నారు. పట్టణ ప్రజలందరికీ యోగాను నేర్పించాలన్న ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిక్షణ సమయంలో ఆహారం అలవాట్లను సైతం మార్చేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.