అనంతపురం

ముమ్మరంగా విత్తన సాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూన్ 24 : జిల్లాలో ఇటీవల కురుసిన వర్షాల వల్ల రైతులు వేరుశెనగ విత్తన సాగు ముమ్మరం చేశారు. జిల్లావ్యాప్తంగా ఏటా సుమారు 7.50 లక్షల హెక్టార్లలో వర్షాధారంగా వేరుశెనగ పంట సాగు చేస్తున్నారు. గత నెలతో పాటు ఈనెలలో పలుమార్లు వర్షాలు కురవడంతో కొందరు రైతులు ముందస్తు దుక్కులు చేసి విత్తనం వేశారు. మరికొందరు దుక్కులు చేసి భూములు సిద్ధం చేశారు. అయితే వాతావరణంలో మార్పుల కారణంగా రానున్న 72 గంటల్లో రాష్ట్రంతో పాటు రాయలసీమ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. రెండు, మూడు రోజుల్లో వర్షాలు కురిస్తే జిల్లావ్యాప్తంగా మరింత విత్తన సాగు పెరగనుంది. ఇప్పటికే జిల్లా వ్యవసాయ శాఖ విత్తన వేరుశెనగ కాయలను సబ్సిడీపై రైతులకు అందించింది. హిందూపురం, మడకశిర, గుడిబండ, అమరాపురం తదితర ప్రాంతాల్లో వేరుశెనగ సాగు తక్కువగా ఉంటుంది. తూర్పు, ఉత్తర మండలాల్లో అత్యధికంగా, పడమట మండలాల్లో మోస్తరుగా వేరుశెనగ విత్తనం వేస్తారు. బోర్లు, బావుల్లో కూడా భూగర్భ జలాలు పెరగనుండటంతో వరితో పాటు కూరగాయల పంటలతో పాటు ఆకుకూరలు కూడా సాగు చేయడానికి రైతులు ఆశతో ఎదురు చేస్తున్నారు. ఇప్పటికే మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వర్షాలు వచ్చి కూరగాయలు పండితే కొంత వరకు ఉపశమనం కలుగుతుంది. ప్రస్తుతం జిల్లాలో అక్కడక్కడా వేసిన వివిధ కూరగాయల పంటలు నీరు లేక దిగుబడి తగ్గిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.