అనంతపురం

పవన విద్యుత్ సంస్థలకు మొక్కల బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూన్ 24 : జిల్లాలోని పవన విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం మొక్కలు పెంచే బాధ్యతలను అప్పగించబోతోంది. జిల్లాలో దాదాపు 15 ప్రాంతాల్లో పవన్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. వీటిలో అత్యధికం కొండ ప్రాంతాల్లో ఉండగా, కొన్ని మైదాన ప్రాంతాల్లో ఉన్నాయి. కోటి మొక్కల పెంపకంలో భాగంగా పవన విద్యుత్ ప్రాజెక్టులకు భాగస్వామ్యం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పవన విద్యుత్ ఉత్పత్తిదారులకు వౌలిక వసతులు కల్పించడం, భూములు సమకూర్చడం చేసినందుకు కృతజ్ఞతగా తమవంతు సామాజిక బాధ్యతగా సమూహిక మొక్కల పెంపకానికి ముందుకు రావాలని కోరింది. ఈమేరకు డిఎఫ్‌ఓ నోడల్ అధికారిగా, జిల్లా యంత్రాంగం నేతృత్వంలో మొక్కల పెంపకం చేపట్టనున్నారు. ఇందుకోసం ఎన్ని మొక్కలైనా సరఫరా చేసేందుకు సోషల్ ఫారెస్ట్రీ ఉన్నతాధికారులు సిద్ధంగా ఉన్నారు. మొక్కల పెంపకంతో పాటు నర్సరీలు సైతం ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. మూడు సంవత్సరాల వ్యవధిలో వంద శాతం మొక్కల్ని సంరక్షణ, నిర్వహణకు ఆయా పవన్ విద్యుత్ ఉత్పత్తిదారులు బాధ్యత వహించాల్సి ఉంది. మైదాన ప్రాంతాల్లో కనీసం 5 ఎకరాల విస్తీర్ణంలో పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ప్రభుత్వం భూమిని కేటాయింది. ఈ ప్రదేశాలతోపాటు కొండ ప్రాంతాల్లో (హిల్ బ్లాక్స్)లో ఫుట్ ప్రింట్ బేసిస్‌లో మొక్కలు నాటేలా మార్గదర్శకాలు రూపొందించారు. ఇందులో భాగంగా శనివారానికి కార్యచరణ ప్రణాళికను ఆయా సంస్థలు ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. ఇప్పటికే స్థానికంగా ఉన్న సంబంధిత సంస్థల సైట్ ఇంజినీర్లు, ఇన్‌చార్జులతో జిల్లా ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. కాగా ఇప్పటికే సుజలాన్ సంస్థ వజ్రకరూరు వద్ద 3వేలు మొక్కల్ని నాటింది. మరో 3వేల మొక్కలు నాటి సంరక్షించేందుకు తన సంసిద్ధతను తెలియజేసినట్లు సమాచారం. అలాగే గ్రీన్ కోర్ విండ్ సంస్థ లక్ష మొక్కలు నాటేందుకు ప్రతిపాదించినట్లు తెలిసింది. జిల్లాను కరవు బారి నుంచి రక్షించడం, పచ్చదనాన్ని పెంపొందించడంలో భాగంగా పవన విద్యుత్ ఉత్పత్తిదారులు తమవంతు సహకారం అందించబోతున్నారు. ఇకపోతే ఆయా ప్రదేశాలకు అనువుగా ఉండే, అక్కడ పెరిగే కానుగ, జత్రోఫా వంటి మొక్కల్లి సోషల్ ఫారెస్ట్రీ విభాగం సరఫరా చేయనుంది. ఈ విషయంపై రెండు రోజుల క్రితం జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఇది వరకే నెడ్‌క్యాప్ జిల్లా మేనేజర్, డిఎఫ్‌ఒ టెరిటోరియల్, డిఎఫ్‌ఓ సోషల్ ఫారెస్ట్రీ, జడ్పీ సిఇఓలతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.