అనంతపురం

జిల్లాలో 337 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, జూలై 5 : జిల్లాలో ఆర్‌అండ్‌బి శాఖ పరిధిలో ఉన్న 337 కిలోమీటర్ల రహదారులను జాతీయ రహదారులుగా మార్చేందుకు కేంద్ర ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు రాయలసీమ జాతీయ రహదారుల సూపరి ంటెండెంట్ ఇంజినీర్ శివకుమార్ తెలిపారు. మంగళవారం స్థానిక ఆర్‌అండ్‌బి కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితం నూతన రాజధాని అమరావతికి జాతీయ రహదారులు ఏర్పా టు చేయడంతోపాటు పలు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చడానికి ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఇందులో జిల్లాలో ఏడు రహదారులు ఉన్నట్లు తెలిపారు. కొడికొండ చెక్‌పోస్టు నుంచి లేపాక్షి, హిందూపురం, మడకశిర, రొళ్ల, శిరా వరకు 122 కిలోమీటర్లు జాతీయ రహదారిగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో రహదారులు ఎలా ఉన్నాయి, సమస్య ఉన్న ప్రాంతంలో పట్టణాల గుండా కాకుండా బైపాస్ ద్వారా మళ్లించడానికి అవసరమైన స్థ లాలు పరిశీలించేందుకు ఆయా ప్రాం తాలను పరిశీలిస్తున్నట్లు ఎస్‌ఇ తెలిపా రు. అంతేకాక చిత్రదుర్గం నుంచి చెళ్లకెర, పావగడ, రొద్దం మీదుగా పెనుకొండకు సైతం జాతీయ రహదారి మ ంజూరైందని, మెణకాలమురు నుంచి రాయదుర్గం, అనంతపురం వరకు 110 కిలోమటర్ల ద్వారా మొత్తం ఏడు రహదారులు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ నుంచి జాతీయ రహదారులుగా మార్చేందుకు ఎంత మేరకు నిధులు అవసరమో ప్రణాళికలు తయారు చేసి కన్సటెన్సీ ద్వారా టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో 1714 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉన్నట్లు చెప్పారు. అనంతరం ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామితో సమావేశమై రహదారుల నిర్మాణానికి స్థల సేకరణ తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో ఇఇ శ్రీనాథ్, డిఇ మహాలింగప్ప ఉన్నారు.

భార్యను హత్య చేసిన భర్త

ధర్మవరం రూరల్, జూలై 5: పట్టణంలోని గాంధీనగర్‌లో నరసింహులు అనే వ్యక్తి భార్య అపర్ణ(35)పై అనుమానంతో సోమవారం అర్ధరాత్రి దాటాక ఆమెతో గొడవ పడి తలపై కత్తిపీటతో నరికి అనంతరం అప్పడాల కర్రతో బాదడంతో అక్కడికక్కడే అపర్ణ మృతి చెందింది. అపర్ణ తల్లిదండ్రులు, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని మార్కెట్ వీధికి చెందిన నరసింహులుకు ధర్మవరం మండలం వసంతపురం గ్రామానికి చెందిన పారేశమ్మ, తిక్కయ్య అనే దంపతుల 4వ కూతురు అపర్ణతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వివాహమైన కొద్ది రోజులకే తరచూ భార్య భర్తలు గొడవ పడుతుండడంతో ఇరువురి తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలు కొన్నాళ్ళపాటు సర్దిచెపుతూ వస్తుండేవారు. అయితే రెండేళ్ళ అనంతరం భార్యపై అనుమానం నరసింహులుకు అధికం కావడంతో అపర్ణ తన పుట్టినిల్లు అయిన వసంతపురానికే వెళ్ళిపోయింది. ఏడాది క్రితం పోతుకుంట రూరల్ పోలీస్ స్టేషన్‌లో అపర్ణ తన భర్త తనను సరిగా చూసుకోలేదంటూ, తరచూ గొడవ పడుతున్నాడని ఫిర్యాదు చేయగా గ్రామ పెద్దలు, నరసింహులు కుటుంబ సభ్యులు పంచాయితీ చేసుకుని అపర్ణను పట్టణానికి తీసుకొచ్చారు. ఆరు నెలల క్రితం మార్కెట్ వీధి నుంచి గాంధీనగర్‌కు కాపురం మార్చిన నరసింహులు సోమవారం రాత్రి తన భార్యను హత్య చేశాడు. ఈ విషయం తెలుసుకున్న సిఐ హరినాథ్‌బాబు, ఎస్‌ఐ సునీతలు సంఘటనా స్థలానికి వెళ్ళి జరిగిన ప్రమాదాన్ని పరిశీలించి మృతురాలి తల్లిదండ్రులకు విషయాన్ని అందించడంతో వారు పట్టణ స్టేషన్‌లో నరసింహులుపై ఫిర్యాదు చేశారు. అప్పటికే నరసింహులు పట్టణ పోలీస్ స్టేషన్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

మహిళ ఆత్మహత్య

బుక్కరాయముద్రం, జూలై 5: బుక్కరాయసముద్రం మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త చెదుళ్ళ గ్రామానికి చెందిన మల్లేశ్వరి(50) తన ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు అందించిన వివరాలు ఇలా వున్నాయి. చెదుళ్ళ గ్రామానికి చెందిన మల్లేశ్వరి గత కొంతకాలంగా కడుపునొప్పి, కీళ్ల నొప్పులతో బాధపడుతుండేదని, మంగళవారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో నొప్పి ఎక్కువ కావడంతో జీవితంపై విరక్తి చెంది ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బుక్కరాయసముద్రం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శవపంచనామా నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పుట్టిన సంతానం నిలువలేదని
తల్లి ఆత్మహత్యాయత్నం

బ్రహ్మసముద్రం, జూలై 5: మండల పరిధిలోని బొమ్మగానిపల్లి గ్రామానికి చెందిన ఆదినారాయణరెడ్డి, రాధిక దంపతులకు పుట్టిన సంతానం నిలవలేదని మంగళవారం తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు భర్త ఆదినారాయణరెడ్డి, ఎఎస్‌ఐ ఇషాక్ బాషా తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు ఆదినారాయణరెడ్డి, రాధికలకు గతంలో నలుగురు బిడ్డలు జన్మించారని, ఏదో కారణం వల్ల నలుగురు సంవత్సరం లోపే చనిపోవడం జరగడంతో 5వ సంతానం కూడా మూడు నెలలు గడువకముందే అనారోగ్యం(్ఫట్స్)తో మరణించడంతో తల్లి రాధిక మనస్తాపం చెంది వారి ఇంటిలోనే చీరతో ఉరి వేసుకుంది. స్థానికులు గమనించి హుటాహుటిన 108 ద్వారా కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించగా ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.

గోడకూలి వ్యక్తి మృతి

బొమ్మనహాల్, జూలై 5 : మండల పరిధిలోని రంగాపురం క్యాంపులో మంగళవారం ఇంటి గోడ కూలి జాఫర్‌సాబ్(60) మృతి చెందాడు. రంగాపురం క్యాంపులో ఉన్న పాత హోటల్‌లో గోడ సమీపంలో జాఫర్‌సాబ్ కూర్చున్నాడు. ఉన్నట్టుండి గోడ ఒక్కసారిగా కూలడంతో జాఫర్‌సాబ్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వ్యక్తి ఆత్మహత్య

బొమ్మనహాల్, జూలై 5 : మండల పరిధిలోని ఏలంజి గ్రామానికి లింగేష్(45) మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. లింగేష్, భార్య మధ్య చెలరేగిన చిన్న పాటి కలహాలతో మనస్థాపానికి గురైన లింగేష్ మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.