అనంతపురం

పంద్రాగస్టు వేడుకల నిర్వహణ.. ‘అనంత’ అదృష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిల్లాకు అరుదైన ఖ్యాతి దక్కబోతోంది. మరువలేని, చరిత్రలో నిలిచిపోయే సువర్ణాక్షర లిఖిత ఆనంద క్షణాలు, ఉద్విగ్నభరిత సంతోషాలు జిల్లావాసుల సొంతం కానున్నాయి. రాష్టప్రతి నీలం సంజీవరెడ్డి వంటి ఉద్ధండ రాజకీయ నేతలు, ఎందరో సాహిత్య సమరవీరులు, స్వాతంత్య్ర సమరయోధులు, సాంస్కృతిక కళామతల్లి ముద్దు బిడ్డలున్న జిల్లా తన చరిత్రలో మధుర ఘట్టాన్ని లిఖించుకోనుంది. తొలిసారిగా జిల్లా కేంద్రం రాష్టస్థ్రాయి స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలకు వేదిక కానుంది. ఆహూతులు, మహామహులకు ఆప్యాయంగా ఆతిథ్యం ఇవ్వబోతోంది.
అనంతపురం, జూలై 15 : రాష్టస్థ్రాయి స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలను నిర్వహించే అవకాశం రావడం ‘అనంత’ అదృష్టంగా భా వించి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోన శశిధర్ సంబంధి త అధికారులను ఆదేశించారు. రా ష్ట్రం విడిపోయిన తర్వాత ఈఏడాది మూడవసారి ఉత్సవాల్ని జిల్లాలో ని ర్వహించాలని ప్రభుత్వం నుంచి సూ త్రప్రాయంగా సమాచారం అందింది. ఇందులో భాగంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. ఈమేరకు శుక్రవారం సాయంత్రం నగరంలోని పిటిసి (పోలీసు ట్రైనింగ్ కళాశాల) స్టేడియాన్ని జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, పిటిసి ప్రిన్సిపల్ వెంకట్రామిరెడ్డి, అడిషనల్ ఎస్పీ మాల్యాద్రి, ఎపి ఎస్‌పి 14వ బెటాలియన్ కమాండెంట్ జగదీష్‌కుమార్, పలు ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ స్టేడియాన్ని సందర్శించి పరిశీలించారు. ఇందులో భాగంగా రాష్టస్థ్రాయి స్వాతంత్య్ర దినోత్సవ నిర్వహణకు సాధ్యాసాధ్యాలు ప్రస్తుతం ఉన్న వౌలిక వసతులు, సదుపాయాలు, అడ్డంకులు వంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. పిటిసి మొత్తం కలియదిరిగి ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం వారితో మాట్లాడుతూ ప్రజలు స్టేడియం గ్యాలరీల్లో కూర్చోవడానికి ప్రస్తుతం ఉన్న గ్యాలరీ మెట్టకు మరమ్మతులు చేయాలని, వివిఐపిల రాకపోకలు, వాహనాలు, ప్రభుత్వ పథకాల శకటాలు తిరిగేందుకు, వచ్చి వెళ్లడానికి, ప్రధాన వేదిక, జెండా కట్ట నిర్మాణం, ఇరువైపులా రెండు వేదికలు, స్టేడియం మైదానం చదును చేయడం, బ్యారీకేడ్లు ఏర్పాటు చేయడం వంటి అనేక సౌకర్యాలు పకడ్బందీగా కల్పించాల్సి ఉందన్నారు. ఇందుకోసం యుద్ధ ప్రాతిపదికన అంచనాలు సిద్ధం చేసి సమర్పించాలని రహదారులు భవనాల శాఖ ఎస్‌ఇ మాధవి, ఇఇలు, పరేడ్ ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేపట్టాలని 14వ బెటాలియన్ కమాండెంట్, అడిషనల్ ఎస్పీని ఆదేశించారు. పిటిసి (తాత్కాలిక అప్పా) స్టేడియం మైదానాన్ని, పార్కింగ్, స్టేడియంలో అతిథి గృహాల గదులు, మైదానం సుందరీకరణ వంటి పనులన్నింటినీ ఈనెలఖారులోగా పూర్తి చేయాలని పిటిసి ప్రిన్సిపాల్‌కు సూచించారు. మిగతా అన్ని శాఖల అధికారులు వారివారి నివేదికలను సమర్పించాలన్నారు. త్వరలో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ఆయా జిల్లా శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మలోలా, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబిలేసు, ట్రాన్స్‌కో ఎస్‌ఈ ప్రసాద్‌రెడ్డి, సమాచార శాఖ ఏడి పి.తిమ్మప్ప, ఎపి ఎస్‌పి డిఎస్‌పి చిన్నికృష్ణ, డిఈఓ అంజయ్య, వివిధ శాఖలకు చెందిన పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.