అనంతపురం
యువకుడి ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
గుంతకల్లు, జూలై 22 : నిరుద్యోగానికి అనారోగ్యం తోడవడంతో జీవితంపై విరక్తి చెందిన డేనియల్(23) శుక్రవారం తెల్లవారుజామున బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కసాపురం పోలీసులు తెలిపిన వివరాల మేరకు సత్యనారాయణ పేటలోని మున్సిపల్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న లక్ష్మీదేవి కుమారుడు డేనియల్ డిగ్రీ వరకు పూర్తి చేశాడు. అతనికి గత కొంతకాలంగా అనారోగ్యం కారణంగా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో పాటు పండ్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న లక్ష్మీదేవికి అనారోగ్యానికి గురికావడంతో మనస్థాపానికి గురైన డేనియల్ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాశాడు. తన అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నానని, తమ్ముడిని బాగా చదివించాలని, తనూ సమీపంలో ఉన్న ఆదెప్ప బావిలో పడి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాశాడు. ఉదయం గమనించిన లక్ష్మీదేవి, రెండవ కుమారుడు మోసెస్‌తో కలిసి బావి వద్దకు వెళ్లారు. అప్పటికే మృతి చెంది శవమై తేలిన కుమారుడిని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కసాపురం పోలీసులు తెలిపారు.