అనంతపురం

ప్రశ్నార్థకంగా కాంట్రాక్టు ఉద్యోగుల భవితవ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మార్చి 31 : రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ సర్కారు ఆ రాష్ట్రంలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు తెలంగాణ అసెంబ్లీలో యాక్ట్-2ను సైతం సవరించి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి. అయితే ఏపి ప్రభుత్వం మాత్రం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసే అంశంపై మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో పాటు రాష్ట్రంలో ఎంతమంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు అనే విషయంలోనూ స్పష్టమైన ప్రకటన చేయలేని పరిస్థితి ప్రభుత్వ వర్గాల్లో నెలకొని ఉంది. దీంతో తమను రెగ్యులర్ చేస్తారా లేదా అన్న దానిపై కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 13,671 మంది ఉద్యోగులు కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్నారు.
రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్న ఉద్యోగుల వివరాలు ఇలా ఉన్నాయి. అగ్రికల్చర్ అండ్ కో ఆపరేషన్, సెక్రటేరియేట్ శాఖలో ఐదుగురు, వ్యవసాయ శాఖలో 56 మంది, ఉద్యానవన శాఖ శాఖలో నలుగురు, పశుసంవర్ధకశాఖలో 12 మంది, బలహీన వర్గాల సంక్షేమ శాఖలో ఇద్దరు, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టులో 70, టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో 412, కళాశాల విద్యలో 667, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్‌లో 5,757, సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటేరియేట్ శాఖలో 20, స్కూల్ ఎడ్యుకేషన్‌లో 714, అడల్ట్ ఎడ్యుకేషన్‌లో ఒకరు, ఏపి స్టేట్ కన్య్సూమర్ డిస్పూట్స్ డీడ్రెస్సల్ కమిషన్‌లో 39 మంది, సెక్రటేరియేట్‌లోని జనరల్ అడ్మినిస్ట్రేషన్‌లో ముగ్గురు, ఐ అండ్ పిఆర్ శాఖలో ఒకరు, సెక్రటేరియేట్ శాఖలోని హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్టుమెంట్‌లో 185, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌లో 155, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో 2,473, కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో 228, డిపార్టుమెంటు ఆఫ్ ఆయుర్వేద, యోగా, యునానీ, సిద్ద అండ్ హోమియోపతిలో 51, డైరెక్టర్ జనరల్ అండ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుశాఖలో 96, డైరెక్టర్ జనరల్ అండ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ జైళ్ల శాఖలో ఒకరు, భూగర్భ జల శాఖలో ఐదుగురు, ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ (అడ్మినిస్ట్రేషన్)లో 15, ఇంజినీర్ ఇన్ చీఫ్ మేజర్ ఇరిగేషన్ ఫ్లడ్ కంట్రోల్ అండ్ డ్రైనేజీ శాఖలో ఇద్దరు, చీఫ్ ఇంజినీర్ మైనర్ ఇరిగేషన్ శాఖలో 9, చేనేత జౌళి శాఖలో నలుగురు, ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ శాఖలో 445, ఇన్య్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌లో ఐదుగురు, రిజిస్ట్రార్ ఆఫ్ హైకోర్టులో 18, ఏపి జ్యుడీషియల్ అకాడమీలో ఒకరు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో 732, మైనార్టీ వెల్ఫేర్‌లో ముగ్గురు, డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్‌లో ఇద్దరు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటేరియట్ విభాగంలో ఏడుగురు, పంచాయతీరాజ్ శాఖలో 823, ఇంజినీర్ ఇన్ చీఫ్(జనరల్ అండ్ పంచాయతీరాజ్) విభాగంలో 52, ఇంజినీర్ ఇన్ చీఫ్, గ్రామీణ నీటి సరఫరా విభాగంలో 107, అపార్డ్‌లో ఒకరు, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్‌లో ఒకరు, ఎక్సైజ్ శాఖ హెచ్‌ఓడిలో ఒకరు, ఎండోమెంట్ హెచ్‌ఓడిలో 8, సోషియల్ వెల్ఫేర్‌లో 9, ట్రైబల్ వెల్ఫేర్‌లో 132, ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్‌లో 319, జువైనల్ వెల్ఫేర్‌లో ఐదుగురు, కల్చరల్ అఫైర్స్‌లో 10, మరి కొన్ని శాఖల్లో ఇద్దరు ఉద్యోగులు కాంట్రాక్టు పద్ధతిన గడచిన కొనే్నళ్లుగా పని చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ వీరిని రెగ్యులర్ చేస్తారా లేదా అన్న సందిగ్ధత నెలకొని ఉంది.
ఉద్యోగ భద్రత కల్పించండి
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ, ఆరోగ్య భద్రత కరువైంది. కనీసం నెల నెలా వేతనాలు కూడా సక్రమంగా అందడం లేదు. ఇకనైనా ప్రస్తుత ముఖ్యమంత్రి పాదయాత్ర సందర్భంగా చేసిన వాగ్దానం మేరకు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి.
- వి.రాఘవేంద్రకుమార్, రాయలసీమ రీజియన్ కార్యదర్శి, ఏపి కాంట్రాక్టు, పారామెడికల్ ఎంప్లాయిస్ ట్రేడ్ యూనియన్