అనంతపురం

‘ఉపాధి’కి ఎండ సెగ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మార్చి 2 : నిత్య కరవుతో అల్లాడే జిల్లా కూలీలకు ఉపాధి హామీ పథకం కింద జీవన భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం పని చేసే ప్రదేశాల్లో భద్రత కల్పించడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉపాధి హామీ పథకం నిబంధనల ప్రకారం కూలీలు పని చేసే ప్రదేశాల్లో తప్పనిసరిగా కనీస సౌకర్యాలు కల్పించాలని ఉపాధి హామీ పథకం నిబంధనలు సూచిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా ఎండ నుంచి రక్షణ కోసం తాత్కాలిక షెడ్లు నిర్మించడం, తాగునీటి వసతి, పిల్లల రక్షణకు ఆయా, ప్రాథమిక వైద్య సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. అయితే జిల్లాలో ఎక్కడా ఇలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మార్చి 18వ తేదీ నుంచి 40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనివల్ల ఉదయం ఎనిమిది గంటల నుంచే అత్యధిక ఎండలు కాస్తున్నాయి. వైద్య నిపుణులు ఉదయం 11 గంటల తర్వాత తప్పనిసరి అయితే తప్ప ఎండల్లో తిరగకూడదంటూ హెచ్చరిస్తున్నారు. అయితే కూలీలు మాత్రం మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పనులు చేయాల్సి వస్తోంది. ఆ సమయంలో కనీసం సేద తీరడానికి తాత్కాలిక షెడ్లు లేకపోవడంతో చిన్నచిన్న చెట్ల కింద సేద తీరాల్సిన పరిస్థితి. అలాగే శుద్ధజలాలు అందించాల్సి ఉన్నా అలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో ఎండకు వేడెక్కిన నీటినే తాగుతున్నారు. ఇక వడదెబ్బ, పనులు చేస్తున్న సమయంలో తగిలే గాయాలకు ప్రాథమిక వైద్య సదుపాయం లేకపోవడంతోప్రమాదాలు పొంచి ఉందని కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక చాలామంది మహిళలు తమతో పాటు తీసుకొచ్చే చిన్నారులను ఎండలోనే కూర్చోపెట్టి పనులు చేస్తున్నారు. కనీసం పిల్లల కోసమైనా తాత్కాలిక షెడ్లు నిర్మించకపోవడం వల్ల వడదెబ్బ బారిన పడే అవకాశం ఉందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా కూలీలకు ఉపాధి కోసం భరోసా ఇస్తున్న ప్రభుత్వ యంత్రాంగం కల్పించాల్సిన కనీస సౌకర్యాలపై కూడా దృష్టి సారించాలని కూలీలు కోరుతున్నారు.