అంతర్జాతీయం

రష్యాలో ఘోర విమాన ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోస్టోవ్-ఆన్-డాన్ (రష్యా), మార్చి 19: ఫ్లై దుబాయి ఎయిర్‌లైన్స్‌కు చెందిన జెట్ విమానం ఒకటి శనివారం తెల్లవారుజామున దక్షిణ రష్యాలో కూలిపోవడంతో ఇద్దరు భారతీయులు సహా విమానంలో ఉన్న మొత్తం 66 మంది చనిపోయారు. ప్రతికూల వాతావరణంలో విమానం రోస్టోవ్-ఆన్-డాన్ విమానాశ్రయంలో దిగడానికి ప్రయత్నించినప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెప్పారు. విమానంలో 55 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారని, మొత్తం అందరూ చనిపోయారని వారు చెప్పారు. ప్రయాణికుల్లో ఇద్దరు భారతీయులు, 44 మంది రష్యన్లు, 8 మంది ఉక్రెయిన్‌కు, ఒకరు ఉజ్బెకిస్థాన్‌కు చెందిన వారున్నారు. చనిపోయిన ఇద్దరు భారతీయులను అంజూ కదిరివేల్ అయ్యప్పన్, మోహన్ శ్యామ్‌గా గుర్తించారు.
ప్రతికూల వాతావరణంలో విమానం దిగడానికి ప్రయత్నించినప్పుడు రన్‌వేనుంచి జారిపోయి పేలిపోయిందని, విమాన శిథిలాలు దాదాపు కిలోమీటరున్నర దూరం పరిధిలో చెల్లా చెదరుగా పడిపోయాయని రష్యా దర్యాప్తు అధికారులు తెలిపారు. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 11.50 గంటల సమయంలో దుబాయిలో బయలుదేరిన విమానం ఉదయం 6.20 గంటల సమయంలో కూలిపోయిందని వారు తెలిపారు. మృతుల్లో 33 మంది మహిళలు, 18 మంది పురుషులు, నలుగురు పిల్లలున్నారని తెలిపారు. విమానం కూలిపోయిన తర్వాత ఆ ప్రాంతమంతా పెద్ద ఎత్తున మంటలు చెలరేగిన దృశ్యాలు స్థానిక టీవీల్లో ప్రసారమైనాయి. 700 మందికి పైగా సహాయక సిబ్బంది, 100 వాహనాలు గంట సేపు శ్రమించి మంటలను ఆర్పివేశాయి. కాగా, విమానం బ్లాక్‌బాక్స్‌ల్లో ఒకదాన్ని కనుగొన్నట్లు దర్యాప్తు అధికారులు ధ్రువీకరించారు. విమానం కూలిపోయే సమయంలో బలమైన గాలులు వీస్తున్నాయన్న హెచ్చరికలు కూడా చేశారు. అంతేకాకుండా భారీగా వర్షం కూడా కురుస్తోంది. ప్రతికూల వాతావరణం కారణంగా విమానం దిగడం కోసం రెండు గంటల పాటు ఆకాశంలో చక్కర్లు కొట్టినట్లు స్థానిక పత్రిక ‘లైఫ్‌న్యూస్’ తెలిపింది. కాగా, ప్రమాదం వార్త తెలిసాక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా, ప్రమాదానికి కారణం సిబ్బంది తప్పా, ప్రతికూల వాతావరణమా, లేక ఇతర కారణాలా అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి దర్యాప్తు చేపట్టినట్లు దర్యాప్తు కమిటీ ప్రతినిధి వ్లాదిమిర్ మార్కిన్ తెలిపారు.

విమానం పేలిపోయన ప్రదేశంలో మంటలు ఆర్పుతున్న సహాయ సిబ్బంది. రోదిస్తున్న మృతుల బంధువులు