అంతర్జాతీయం

కలసికట్టుగా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 7: భారత్-అమెరికాలు అన్ని రంగాల్లోనూ భుజం భుజం కలిపి పనిచేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ఓవల్ హౌజ్‌లో గంటకుపైగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాము చర్చించిన అనేక అంశాలను సంయుక్త విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. 2008లో ఇరు దేశాల మధ్య కుదిరిన చారిత్రక పౌర అణు ఇంధన ఒప్పందం అమలు పురోగతిపై మోదీతో తాను చర్చించినట్టు ఒబామా వెల్లడించారు. ప్రాంతీయ భద్రతకు సంబంధించిన అనేక అంశాలపైనా తాము చర్చలు జరిపామని, అలాగే సైబర్ సెక్యూరిటీ విషయంలోనూ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామన్నారు.
భారత గణతంత్ర వేడుకలకు హాజరు కావడం తనకు చిరస్మర అనుభూతిని ఇచ్చిందని ఈ సందర్భంగా ఒబామా గుర్తు చేసుకున్నారు. భారత్-అమెరికాలు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలని, వీటి మధ్య ఎంతగా పరస్పర సహకారం విస్తృతమైతే అంతగానూ వర్థమాన దేశాలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌కు గుర్తింపు లభించిందని, ప్రపంచ శాంతి, భద్రత కోసం అమెరికాతో కలిసి పని చేస్తామని మోదీ తెలిపారు. రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను కూడా మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించామని చెప్పారు. అనేక అంశాలపై అమెరికాకు చేరువ కావడం, భావ సారూప్యతతో పనిచేయడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ముఖ్యంగా క్షిపణి టెక్నాలజీ గ్రూపులో అలాగే ఎన్‌ఎస్‌జిలో భారత సభ్యత్వానికి అన్ని విధాలుగా మద్దతు అందించినందుకు ‘నా మిత్రుడు ఒబామాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’అని మోదీ తెలిపారు. ఓవల్ హౌజ్ సమావేశానంతరం వీరిద్దరి మధ్య వైట్‌హౌస్‌లో కూడా భేటీ జరిగింది. ఆ సందర్భంగా కూడా అత్యంత కీలకమైన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. వీరిద్దరూ ముఖాముఖీ భేటీ కావడం ఈ రెండేళ్ల కాలంలో ఇది ఏడోసారి. తమ మధ్య ఇప్పటికే బలపడిన సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడం ద్వారా భారత్-అమెరికాలు మరింత స్పష్టమైన రీతిలోనే చైనా ఆధిపత్యం పట్ల తన అసహనాన్ని వ్యక్తం చేశాయి. ముఖ్యంగా ఆసియాపసిఫిక్ ప్రాంతంపై ఎవరి ఆధిపత్యాన్ని, జోక్యాన్ని సహించేది లేదన్న బలమైన సంకేతాన్ని అందించాయి. అలాగే దక్షిణ చైనా మహా సముద్ర ప్రాంతంలో భారత్,అమెరకా, వాటి మిత్ర దేశాలతో కలిసి చైనా పని చేయాల్సిందేనన్న స్పష్టమైన సంకేతాన్ని కూడా ఒబామా-మోదీలు సంయుక్తంగా అందించారు. పారిస్ వాతావరణ ఒప్పందాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకూ కృత నిశ్చయంతో కృషి చేస్తామన్నారు.

చిత్రం... వైట్‌హౌజ్‌లోని ఓవల్ కార్యాలయం నుంచి బరాక్ ఒబామాతో కలిసి అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ