అంతర్జాతీయం

అండమాన్ నికోబార్ వద్ద ప్యాసింజర్ నౌకకు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్ట్‌బ్లెయిర్, ఆగస్టు 2: అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో ప్రమాదానికి గురైన ప్యాసింజర్ షిప్ ఎంవీ స్వరాజ్ నుంచి 343 మంది సురక్షితంగా కోస్టుగార్డు సిబ్బంది ఒడ్డుకు చేర్చారు. కార్ నికోబార్‌కు 40 నాటికన్ మైళ్ల దూరంలో ఎంవీ స్వరాజ్ ప్రమాదానికి గురైంది. నౌకలోకి భారీగా నీరు చేరడంతో ఇండియన్ కోస్ట్‌గార్డ్ సహాయం అర్ధించారు. అప్రమత్తమైన కోస్ట్‌గార్డ్ సిబ్బంది అరుణ్ అసఫ్ అలీ నౌకలో అక్కడకు చేరుకుని ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అరుణ్ అసఫ్ అలీ వేగవంతమైన తీర రక్షణ నౌక. దీనిలోని టెక్నాలజీ ద్వారా నౌకలు ప్రమాదానికి గురైనప్పుడు రక్షణకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.