అంతర్జాతీయం

కలసి నడుద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్తానా, ఆగస్టు 3: రక్షణ రంగంలో పరస్పరం సహకరించుకోవాలని భారత్-కజకిస్తాన్ నిర్ణయించాయి. భారత్ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ శుక్రవారం ఇక్కడ కజకిస్తాన్ ప్రభుత్వాధినేతలతో భేటీ అయ్యారు. కజక్ తమకు వ్యూహాత్మక భాగస్వామి అని ఈ సందర్భంగా సుష్మా స్పష్టం చేశారు. వాణిజ్యం, ఇంధనం, భద్రత, ఐటీ రంగాలకు సంబంధించి ఇరుదేశాల మధ్య సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి. సెంట్రల్ ఆసియా దేశాలైన కజకిస్తాన్, ఉజ్‌బెకిస్తాన్, ఖైర్గెస్తాన్‌లో పర్యటనలో భాగంగా ఆమె ఇక్కడకు వచ్చారు. తొలుత కజకిస్తాన్ విదేశాంగ మంత్రి కైరాత్ అబ్‌డ్రాఖ్‌మనొతో వివిధ కీలక అంశాలపై సుష్మా చర్చించారు. ప్రతినిధుల స్థాయి చర్చల్లో పలు అంశాలపై ఏకాభిప్రాయం సాధించారు. వాణిజ్యం, పెట్టబడులు, రక్షణ, భద్రత, ఇంధనం, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ ఐటీసీ), ఫార్మా రంగాలకు సంబంధించి ఇచ్చిపుచ్చుకునే విధానం అమలుచేయాలని ఉభయులు నిర్ణయించారు. అలాగే కజక్ ప్రధాన మంత్రి బకైజాన్ సిగంటయెవ్‌తో సుష్మా భేటీ అయ్యారు. వ్యాపార, వాణిజ్యాలతో పాటు జాయింట్ ఫిల్మ్ ప్రొడక్షన్, టూరిజం, సాంస్కృతిక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలతో పాటు ఇరుదేశాలకు ప్రయోజనం చేకూరే పథకాలపై ఇరువురు నేతలూ సమగ్రంగా చర్చించారు.‘2009 నుంచి కజకిస్తాన్ మాకు వ్యూహాత్మక భాగస్వామిగా ఉంది. ఇరుదేశాల అవసరాలు, ప్రయోజనాల మధ్య సారూప్యత ఉంది. అలాగే దౌత్యపరంగా సంబంధాలు మరింత బలపడేందుకు పర్యటన దోహపడుతుంది’అని కజక్ ప్రధానితో భేటీ తరువాత సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య మైత్రి మరింత బలోపేతం కావలని ఆమె ఆకాంక్షించారు. ప్రధానంగా రక్షణ రంగంలో పరస్పర సహకారం అందంచుకోవాలని తాము నిర్ణయించుకున్నట్టు ఆమె వెల్లడించారు. అలాగే ప్రపంచంలోనే ఆర్థింగా బలమైన దేశంగా భారత్ ఆవిర్భవిస్తోంది, దేశంలో అభివృద్ధి శరవేంగా సాగుతోందని ఈ సందర్భంగా సుష్మా పేర్కొన్నారు. ఉత్పత్తి, పరిశోధనల రంగంలో భారత్ దూసుకుపోతోందని ఆమె తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో అనేక ప్రతిష్టాత్మక పథకాలు ప్రవేశపెట్టినట్టు, అవి దిగ్విజయంగా నడుస్తున్నాయని స్వరాజ్ వెల్లడించారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, క్లీన్ ఇండియా, స్టార్ట్ అప్ ఇండియా, స్మార్ట్ సిటీలను ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి ప్రస్తావించారు. భారత్ డిజిటల్ ఇండియా పథకంపై కజకిస్తాన్ విదేశాంగ మంత్రి ఎంతో ఆసక్తిచూపారని, తాము కూడా సొంతంగా డిజిటల్ ప్రపంచం నిర్మించుకుంటామని అబ్‌డ్రాఖ్‌మనొ చెప్పారని ఆమె స్పష్టం చేశారు.