అంతర్జాతీయం

కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఆగస్టు 4: జమ్మూ-కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన భీకర కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ సంఘటనలో సాధారణ పౌరుడు ఒకరు మరణించగా, మరో 10 మంది గాయపడ్డారు. శనివారం ఉదయం కిలోరా ప్రాంతంలో ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదులు పరస్పరం కాల్పులకు తెగబడ్డారు. శుక్రవారం రాత్రి జరిగిన కాల్పుల్లో ఒక మిలిటెంట్ హతం కాగా, శనివారం మరో నలుగురిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. హతమైన ఐదుగురు మిలిటెంట్లు స్థానికులుగా గుర్తించినట్టు సంబంధిత అధికార వర్గాలు పేర్కొన్నాయి. కాగా, స్థానిక మిలిటెంట్లు ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో వందలాదిమంది సంఘటనా స్థలానికి చేరుకుని భద్రతా బలగాలపై రాళ్లదాడికి దిగారు. దీంతో సెక్యూరిటీ బలగాలు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.