అంతర్జాతీయం

షరీఫ్ కుమారులకు రెడ్‌కార్నర్ నోటీసులివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఆగస్టు 4: ప్రస్తుతం జైలు శిక్షను అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమారులు హసన్, హుస్సేన్‌లకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆ దేశపు ఉన్నత అవినీతి నిరోధక విభాగం ఇంటర్‌పోల్‌ను కోరింది. 2017 జూలై నెలలో ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం నవాజ్ షరీఫ్ కేసులో తీర్పునిచ్చిన నేపథ్యంలో నవాజ్ షరీఫ్ కుమారులు హసన్, హుస్సేన్‌లపైన అవినీతి కార్యకలాపాలకు సంబంధించిన మూడు కేసులు ఉన్నాయి. ఈ కేసులకు సంబంధించి కోర్టుకు హాజరు కాకుండా దేశం విడిచి పరారయ్యారని వారిమీద అభియోగాలున్నాయి. ఈ ఇద్దరు నిందితులను దేశానికి తిరిగి రప్పించాల్సిందిగా పాక్ జాతీయ జవాబుదారీ విభాగం (ఎన్‌ఏబీ) చైర్మన్, విశ్రాంత న్యాయమూర్తి జావేద్ ఇక్బాల్ ఆదేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆదేశించారు. ఈ క్రమంలోనే ఇంటర్‌పోల్‌ను పాక్ అవినీతి నిరోధక విభాగం సంప్రదించి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని కోరింది. తల్లి కుల్‌సూమ్ నవాజ్ బాగోగులు చూసుకునేందుకంటూ హసన్, హుస్సేన్ లండన్‌లో నివశిస్తున్నారని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ అనే వార్తా సంస్థ పేర్కొంది. విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని ఉటంకిస్తూ పాకిస్తాన్ ఫెడరల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) ఫ్రాన్స్‌లోని ఇంటర్‌పోల్ ప్రధాన కార్యాలయంలో దరఖాస్తుచేస్తూ హసన్, హుస్సేన్‌లకు రెడ్ వారెంట్‌లను జారీ చేయాలని కోరినట్లు ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వివరించింది. కాగా గతంలో పనామా పేపర్స్ కేసులో అవినీతి కేసులకు సంబంధించి హసన్, హుస్సేన్‌లను ప్రత్యేక ట్రయల్ కోర్టుల్లో విచారించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించినా వారు విచారణకు హాజరుకాలేదని, ఇప్పటికే వారిపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్‌లు ఉన్నాయని ఇంటర్‌పోల్‌కు పాక్ అధికారులు వివరించారు. కోర్టు నవాజ్ షరీఫ్‌కు పదేళ్లు, కుమార్తె మరియం నవాజ్‌కు ఏడేళ్లు, అల్లుడు విశ్రాంత కెప్టెన్ సఫ్దార్‌కు యేడాది జైలుశిక్ష విధించింది. అలాగే ఎనిమిది మిలియన్ పౌండ్ల జరిమానాను నవాజ్‌షర్‌ఫ్‌కు, రెండు మిలియన్ పౌండ్లను కుమార్తెకు విధించిన విషయాన్ని పాక్ ఇంటర్‌పోల్‌కు వివరించింది. పనామా పేపర్స్ కుంభకోణంలో ఆర్జించిన అవినీతి సొమ్ముతో నవాజ్ షరీఫ్, అతని కుటుంబీకులు లండన్‌లో నెస్కాయిల్, నెల్సన్ అనే కంపెనీలను నెలకొల్పారని మాజీ క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ ఓ పత్రికా కథనాన్ని ఆధారంగా చేసుకొన్ని అప్పట్లో ఆరోపణలు చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లారు. దీంతో 2017 జూలైలో నవాజ్ షరీఫ్ ప్రధాన మంత్రిగా కొనసాగేందుకు అర్హత కోల్పోయారు. కాగా లండన్‌లోని కంపెనీలకు యజమానులుగా కొనసాగుతున్న హసన్, హుస్సేన్‌లకు లండన్‌లో సుమారు 200 మిలియన్ పౌడ్ల విలువైన విలాసవంతమైన ప్లాట్లు ఉన్నాయన్నది ప్రధాన ఆరోపణకాగా ఆ ప్లాట్లు అవినీతి సొమ్ముతో కొనుగోలు చేసినవి కావని హుస్సేన్ అంటున్నాడు.