అంతర్జాతీయం

ఇంట్లో కూర్చుని అభివృద్ధి లేదంటారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌సమంద్ (రాజస్తాన్), ఆగస్టు 4: ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజస్తాన్‌లో పర్యటించకుండా ఇంట్లో కూర్చుని అభివృద్ధి జరగలేదంటూ విమర్శించడం తగదని, గ్రామాల్లో పర్యటించాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా హితవుపలికారు. కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి నిరోధక పార్టీ అని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎక్కువ కాలంలో అధికారంలో ఉండి కూడా పేదరికాన్ని నిర్మూలించలేకపోయిందని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో అభివృద్ధి వేగవంతమైందన్నారు. అభివృద్ధి, సంక్షేమ గురించి చెప్పుకునేందుకు కాంగ్రెస్ అకౌంట్‌లో ఏమీ లేదన్నారు. అభివృద్ధిపై బీజేపీ విమర్శించే స్థాయి కాంగ్రెస్‌కు లేదన్నారు. శనివారం ఇక్కడ ఆయన త్వరలో జరగనున్న రాజస్తాన్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి వసుంధర రాజే చేపట్టిన 58 రోజుల బస్సు యాత్రను ప్రారంభించారు. సుప్రసిద్ధ చార్‌భుజనాథ్ దేవాలయం నుంచి ఈ యాత్ర మొదలైంది. ఈ యాత్రకు రాజస్తాన్ గౌరవ్ యాత్ర అని నామకరణం చేశారు. అంతకుముందు అమిత్‌షా, వసుంధర రాజే దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఈ యాత్ర మొత్తం 200 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 165 నియోజకవర్గాల ద్వారా కొనసాగుతుంది. ఈ యాత్ర సెప్టెంబర్ 30వ తేదీన అజ్మీర్‌లో ముగుస్తుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో అమిత్ షా మాట్లాడుతూ, ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో రాజస్తాన్‌కు రెండున్నర రెట్లు ఎక్కువగా గతంతో పోల్చుకుంటే నిధులను విడుదలచేశారన్నారు. అస్సాంలో జాతీయ పౌర రిజిస్టర్ విడుదల చేసిన తర్వాత కాంగ్రెస్ విభజన రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ ప్రజలను ఓటు బ్యాంకులా చూస్తోందని ఆయన విమర్శించారు. అక్రమంగా మన దేశం లో చొరబడి నివసిస్తున్న బంగ్లాదేశీయులను మన దేశంలోనే ఉండేందుకు అనుమతించాలా లేక చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలా అనే విషయమై రాహుల్ గాంధీ బదులివ్వాలన్నారు. ఓటు బ్యాం కు రాజకీయాలతో సంబంధం లేకుండా దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకుని బీజేపీ పని చేస్తోందన్నారు. జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించామన్నారు. దేశాభివృద్ధికోసం మోదీ ప్రభుత్వం 116 స్కీంలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో రాజస్తాన్ అత్యంత వెనకబడిన రాష్ట్రంగా ఉండేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని అన్ని సీట్లలో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ముఖ్యమంత్రి వసుంధర రాజే మాట్లాడుతూ కాంగ్రెస్ అభివృద్ధిని అడ్డుకుంటున్న పార్టీ అని విమర్శించారు. ప్రజల సమస్యలు ఆ పార్టీకి తెలియవన్నారు. గత ఐదేళ్లలో బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాల ఫలాలు పేదలకు అందాయన్నారు. గతంలో వెనకబడిన రాష్ట్రంగా ఉన్న రాజస్తాన్ ఈ రోజు అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో అగ్రగామిగా ఉందన్నారు.