అంతర్జాతీయం

వాణిజ్య, ఆర్థిక రంగాల్లో పరస్పర సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిష్‌కెక్, ఆగస్టు 4: కిర్గిస్తాన్‌తో వాణిజ్యం, ఇంధనం, రక్షణ, భద్రత వంటి అంశాల్లో పరస్పర సహకారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు వీలుగా భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎర్లాన్ అబ్డీల్‌దాయెవ్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. శుక్రవారం ఇక్కడి ఇల్సిక్ కుల్‌కు చేరుకున్న సుష్మా స్వరాజ్ తూర్పు కిర్గిస్తాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా కిర్గిస్తాన్‌కు చేరుకున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, ఐటీ, ఆరోగ్యం, మానవ వనరులు, టూరిజం, సంయుక్తంగా సినిమాల నిర్మాం వంటి అనేక రంగాల్లో పరస్పరం సహకారాన్ని అందించేందుకు వీలుగా గల అవకాశాలపై సుదీర్ఘంగా వారు చర్చించారు. కాగా, సుష్మా స్వరాజ్ టూర్‌లో భాగంగా కజకస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్జెకిస్తాన్ దేశాల్లో పర్యటించి ఆయా అంశాలపై ఒనగూరే ప్రయోజనాలపై చర్చలు జరుపుతారు.