అంతర్జాతీయం

భారత్‌కు వ్యూహాత్మక వాణిజ్య హోదా-1 గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 4: భారత్‌కు వ్యూహాత్మక వాణిజ్య హోదా-1 గుర్తింపును ఇస్తూ అమెరికా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడంతో భారత్-అమెరికా మధ్య స్నేహ సంబంధాలు మరింత బలపడ్డాయి. ఆసియాలో ఈ హోదాను పొందిన మూడవ దేశం భారత్. ఇంతవరకు జపాన్, దక్షిణ కొరియాకు వ్యూహాత్మక వాణిజ్య హోదా-1 (ఎస్‌టీఏ)ను మంజూరు చేసింద. దీని వల్ల రక్షణ రంగంలో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలు, ఆయుధాలు భారత్‌కు ఎటువంటి ఆంక్షలు లేకుండా లభించనున్నాయి. న్యూక్లియార్ సప్లైయర్స్ గ్రూప్ (ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌కు ఇంకా సభ్యత్వం లభించలేదు. అణస్త్ర సరఫరాదారుల గ్రూపులో సభ్యత్వం కోసం భారత్ ఇప్పటికే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మిసైల్ టెక్నాలజీ కంట్రోల్, వాసెనార్ అరేంజ్‌మెంట్, ఆస్ట్రేలియా గ్రూపు, ఎన్‌ఎస్‌జీ గ్రూపులో ఉన్నదేశాలకు మాత్రమే వ్యూహాత్మక వాణిజ్య హోదాను అమెరికా కల్పిస్తుంది. ట్రంప్ ప్రభుత్వం భారత్‌కు మంచి అవకాశం ఇవ్వడంతో చైనా, పాకిస్తాన్ దేశాల్లో కలవరం ప్రారంభమైంది. చైనా తనకు వ్యూహాత్మక ప్రత్యేక హోదా ఇవ్వాలని చాలా సంవత్సరాలుగా కోరుతోంది. ఈ హోదా భారత్‌కు లభించడంతో ప్రపంచ దేశాల్లో పరపతి పెరగడంతో పాటు చైనాకు హెచ్చరిక చేసినట్లుగా ఉందని అంతర్జాతీయ దౌత్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని వల్ల భారత్ వ్యూహాత్మక వాణిజ్య హోదా దేశాలకు అందుతున్న అన్ని రకాల రక్షణ టెక్నాలజీలో భాగస్వామ్యం లభిస్తుంది. ఈ హోదా వల్ల ఇకపై అమెరికా-్భరత్‌లు అంతర్జాతీయ అణు నిరాయుధీకరణకు, ఆర్థికాభివృద్ధికి, శాంతి, సహకార రంగాల్లో ఉమ్మడిగా పనిచేసేందుకు వీలవుతుంది. జపాన్, దక్షిణ కొరియా, భారత్ దేశాలకు అమెరికా ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల చైనా ఆధిపత్యాన్ని సవాలు చేసేందుకు వీలవుతుందని అమెరికా అంచనా. ఎంటీసీఆర్ విభాగంలో 2016 జూన్ 27న, వాసేన్నార్ అరేంజ్‌మెంట్‌లో 2017 డిసెంబర్ 7న, ఆస్ట్రేలియా గ్రూపులో 2018 జనవరి 19వ తేదీన భారత్‌కు సభ్యత్వం లభించింది. 21వ శతాబ్ధంలో రక్షణ రంగంలో ఆధునాతన టెక్నాలజీని అమెరికా-్భరత్‌లు పంచుకునేందుకు ఈ హోదా ఉపయోగపడుతుంది.