అంతర్జాతీయం

ఆంక్షలు బేఖాతర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, ఆగస్టు 4: ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఆంక్షలను బేఖాతరు చేస్తున్న ఉత్తర కొరియా అణు ప్రయోగాలు, అణ్వస్త్ర తయారీని కొనసాగిస్తునే ఉంది. అంతేగాక, మారణాయుధాలను యథేచ్ఛగా విక్రయిస్తున్నది. సముద్ర మార్గంలో పెట్రోలియం ఉత్పత్తుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నది. ఈ విషయాలను ఐరాస నిపుణుల నివేదిక బట్టబయలు చేసింది.
ఆసియా దేశాలు, ప్రత్యేకించి ఉత్తర కొరియా అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేసిన ఈ కమిటీ సమర్పించిన నివేదిక ప్రకారం ఉత్తర కొరియా అణు ప్రయోగాలకు ఇంకా తెరదించలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే భేటీ అయినప్పుడు దేశంలో అణు ప్రయోగాలు జరగడం లేదని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అతని మాటల్లో నిజం లేదని, అక్కడ అణు పరీక్షలతోపాటు వివిధ రకాలైన క్షిపణుల పాటవ పరీక్షలు కూడా కొనసాగుతున్నాయి. కొంతమంది విదేశీ ఏజెంట్ల ద్వారా చిన్న, మధ్య తరహా ఆయుధాలను వివిధ దేశాలకు సరఫరా చేస్తున్నది. ప్రత్యేకించి అంతర్యుద్ధంలో మునిగితేలుతున్న సిరియాతోపాటు, యెమెన్, లిబియా, సూడాన్ తదితర దేశాలకు ఆయుధాలను అందచేస్తున్నది. పెట్రోలియం ఉత్పత్తులను సైతం అక్రమ రవాణా చేస్తున్నది. ఐక్యరాజ్య సమితి విధించిన ఆంక్షలను, అమెరికా హెచ్చరికలను ఉత్తర కొరియా ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
ఈ పరిస్థితుల్లో మరింత కఠినంగా వ్యవహరించకపోతే, ఉత్తర కొరియా వల్ల ప్రపంచ దేశాలకు ముప్పు తప్పదని ఐక్యరాజ్య సమితి నిపుణుల కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది.