అంతర్జాతీయం

చదువులో సున్నా... గానంలో మిన్న!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, ఆగస్టు 4: కిషోర్ కుమార్... పరిచయం అవసరంలేని పేరు... గాయకుడిగా అత్యున్నత శిఖరాలను అధిరోహించిన కిషోర్ పాటలు వినని వారు లేరనడం అతిశయోక్తి కాదు. హిందీ రాని వారుకూడా ఆయన పాటలకు మైమరచిపోతారు. ఇక అర్థం కూడా తెలిసిన వారు కిషోర్ ఫిదా అవుతారు. పట్టుదలతో కృషి చేస్తే ఎంతటి ఉన్నత శిఖరాలైనా అధిరోహించవచ్చని నిరూపించిన కిషోర్ ఎంతో మందికి మార్గదర్శకుడు. చదువులో అతని ప్రతిభ అంతంత మాత్రమే.. కానీ, పాటల్లో దిట్ట. చిన్నతనం నుంచి సంగీతాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన కిషోర్ తాను ఎంచుకున్న రంగంలో తిరుగులేని విజయాలను సాధించాడు. హిందీ సినిమా పాటలను కొత్త పుంతలు తొక్కించాడు. కేవలం గాయకుడిగానేగాక, పాటల రచయితగా, సంగీత దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా బహుముఖ ప్రజ్ఞ కనబరిచాడు. ఆ అసాధారణ ప్రతిభావంతుడు ఎట్లా చదివేవాడన్న ఆసక్తి సహజంగానే ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కిషోర్ 89వ జయంతి సందర్భంగా శనివారం ఇండోర్ క్రిస్టియన్ కాలేజీ (ఐసీసీ) ఆయన మెట్రిక్యులేషన్ మార్కుల జాబితాను బయటపెట్టింది. ఇంటర్మీడియట్‌లో చేరేందుకు ఐసీసీకి కిషోర్ సమర్పించిన ఈ మార్క్స్ మెమో పరిశీలిస్తే, ఆయనను ఉత్తమ విద్యార్థిగా పేర్కోలేం. పశ్చిమ బెంగాల్‌లోని ఖాండ్వాలో జన్మించిన కిషోర్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో, హిందీ మీడియంలో మెట్రిక్యులేషన్‌ను 1946లో ఉత్తీర్ణుడయ్యాడు. ఇంగ్లీషులో 175కు 69, జనరల్ నాలెడ్జిలో 25కు 9, కెమిస్ట్రీ-్ఫజిక్స్‌లో 150కి 64, జాగ్రఫీ-ఎలిమెంటరీ హిస్టరీలో 150కి 53 చొప్పున మార్కులు సాధించాడు. హిందీలో 150కిగాను 53 మార్కులే తెచ్చుకోగలిగాడు. కానీ, తర్వాతి కాలంలో అదే హిందీలో తిరుగులేని పట్టు సంపాదించి, స్వయంగా పాటలు రాసే స్థాయికి ఎదిగాడు. మాతృభాష హిందీనేమో అన్నంత స్పష్టంగా కిషోర్ అన్ని రకాల పాటలు పాడాడు. శాస్ర్తియ సంగీతం నేర్చుకోకపోయినా, సైగల్‌ను తలపించే విధంగా రాగాలను ఆలపించేవాడు. పాటలపై ఉన్న మమకారంతో, గాయకుడిని కావాలన్న పట్టుదలతో ఇండోర్‌లో ఇంటర్మీడియట్‌ను మధ్యలోనే ఆపేసిన కిషోర్ ముంబయి (అప్పటి బొంబాయి) చేరుకున్నాడు. అతని ప్రతిభకు బాలీవుడ్ నీరాజనాలు పలికింది. చదువుకూ, ప్రతిభకూ సంబంధం లేదని నిరూపించిన కిషోర్ ఎంతోమందికి మార్గదర్శకుడు.